‘సింగ్ గీతం’ ఘన విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా 40 ఏళ్ల కలని సాకారం చేసిన ఘనత అశ్విన్ గారిదే: డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు లేటెస్ట్ గోల్డెన్ బ్లాక్ బస్టర్ 'సింగ్ గీతం'. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోనమై ఈ చిత్రం ప్రేక్షకులు విమర్శకులు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘సింగ్ గీతం’ చాలా ఆసక్తికరంగా వుంది. కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే మీలాంటి లెజెండరీ దర్శకుడికి ఇది పర్ఫెక్ట్ మూవీ. ఈ కథ 40 ఏళ్లుగా…
