శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎస్‌వీబీసీ అద్భుత సేవలు
ప్రతి క్షణం లైవ్ కార్యక్రమాలతో భక్తులను అలరించిన ఎస్‌వీబీసీ ఈ కార్యక్రమాలకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.. ఈ సేవల్లో భాగం కావడం పూర్వజన్మ సుకృతం ఎస్‌వీబీసీ ఛానల్ ఛైర్మన్ శ్రీధర్ వర్మ.. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 15.09.2026 నుంచి 23.09.2026 వరకు తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే! శ్రీవారి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు బారులు తీరారు. స్వామికి జరిగే కైంకర్యాలను ప్రత్యక్షంగా భక్తులకు చూపించి భక్తులను తరింపజేయడంతో ఎస్‌వీబీసీ ఛానల్ వందశాతం సక్సెస్ అయిందని చైర్మన్ శ్రీధర్ వర్మ అన్నారు. ఈ మేరకు కార్యక్రమాలు నిర్వహించడంతో సహకరించిన ప్రతి ఒక్కరికీ శ్రీధర్‌వర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘తొమ్మిది రోజులపాటు బ్రహోత్సవాలు…
