Skip to content

ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారo

ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ  ప్రమాణ స్వీకారo
ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ  ప్రమాణ స్వీకారo
ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ  ప్రమాణ స్వీకారo

తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్‌గా శ్రీధరవర్మ బాధ్యతలు స్వీకరించారు. అలిపిరి సమీపంలోని ఎస్వీబీసీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి నేతలు శ్రీధరవర్మను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీధరవర్మ పేర్కొన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఖ్యాతిని, హిందూ ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో ఎస్వీబీసీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఉద్యోగులందరితో సమన్వయంతో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, మంత్రి నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ గారికి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని శ్రీధర్ వర్మ తెలిపారు. శ్రీ రంగనాయకుల మండపంలో ఆశీర్వాదాలు అందుకున్న ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ గారు అనంతరం తిరుమల నుండి తిరుపతికి చేరి ఎస్విబిసి చైర్మన్ గా తన బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి మోహన్ కృష్ణ గారు, నందమూరి రామకృష్ణ గారు, నందమూరి మోహన రూపా గారు, కామినేని సీమంతిని గారు, దగ్గుబాటి నివేదిత గారు, ఏపీ ఎఫ్ డి సి చైర్మన్ భారత భూషణ్ గారు, తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ గారు హాజరై శ్రీధర్ వర్మ గారికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నందమూరి మోహనకృష్ణ గారు మాట్లాడుతూ… “నా సోదర సమానుడు శ్రీధర్ వర్మకు ఎస్వీబీసీ చైర్మన్ గా ఎంపికైనందుకుగాను నా శుభాకాంక్షలు. రక్తం పంచుకుని పుట్టకపోయినా ఆప్యాయత అనురాగాలలో నాకు మా సోదరుడు ఎలాగో రాజు గారి పిల్లలు కూడా అంతే. నాడు రామారావు గారు తొలి పార్టీ టికెట్ రాజు గారికి ఇచ్చినప్పటికీ ఆయన తనకు టికెట్ వద్దు అని అనడంతో శ్రీవారి సేవలో ఉండాలంటూ నాన్నగారి కోరికను కాదనకుండా టిటిడి కోసం పనిచేశారు. అభివృద్ధి కోసం ఆయన స్వయంగా ముందుకు వచ్చి తన భూమిని దానం చేశారు. నాన్నగారి తరం నుండి ఆ కుటుంబం మాకు అండగా ఉన్నారు. అటువంటి రాజుగారి కుమారుడు నేడు తన వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ టిటిడి ఎస్వీబీసీ చైర్మన్ గా ఎంపిక అవడం చాలా సంతోషకరం” అన్నారు.

నందమూరి రామకృష్ణ గారు మాట్లాడుతూ… ” రామారావు గారి అభిమాని ఎన్టీఆర్ రాజుగా ప్రసిద్ధి చెందిన రాజుగారి కుమారుడు శ్రీధర్ వర్మ నేడు ఎస్విబిసి చైర్మన్ గా నియమించబడటం మా కుటుంబ సభ్యులకు ఆనందకరం. ఆయన దానికి అర్హుడు. గత నాలుగు తరాలుగా ఆ కుటుంబం స్వామివారి సేవలో ఉన్నారు. ఎన్టీఆర్ రాజుగారు చాలా నమ్మకంగా ఉండేవారు, స్వామివారి విషయంలో బాగా స్ట్రిక్ట్ గా ఉండేవారు. అటువంటి మహానుభావుడు కొడుకు శ్రీధర్ వర్మ ఆయన బాటలో నడుస్తూ ఎస్వీబీసీ ఛానల్ ను మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళ్తారని కోరుకుంటున్నాను. ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు నాన్నగారు అలాగే రాజు గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. శ్రీధర్ వర్మ ను చైర్మన్ గా ఎంపిక చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే సంబంధిత సభ్యులందరికీ ధన్యవాదాలు అనుకుంటున్నాను” అన్నారు.

నందమూరి మోహన రూప గారు మాట్లాడుతూ… “నేడు నందమూరి కుటుంబమంతా చాలా ఆనందించే రోజు. మా పెదనాన్న గారు ఎన్టీఆర్ రాజు గారికి గొప్ప గౌరవం దక్కింది. రాజు గారు రామారావు గారి అభిమానిగా ఉంటూ నిస్వార్ధంగా ఆయన కోసం పనిచేశారు. విలువలతో కూడిన వ్యక్తి రాజుగారు, చివరి వరకు అలాగే ఉన్నారు. అటువంటి అరుదైన వ్యక్తికి కుమారుడు మా అన్నయ్య శ్రీధర్ వర్మ గారు నేడు ఎస్విబిసి చైర్మన్ గా ఎంపిక కావడం సంతోషకరం. ఆ పదవికి అయిన పూర్తిగా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఆయనకు ఇటువంటి గౌరవం ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు అనుకుంటున్నాను” అన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.