Skip to content

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎస్‌వీబీసీ అద్భుత సేవలు

  • ప్రతి క్షణం లైవ్‌ కార్యక్రమాలతో భక్తులను అలరించిన ఎస్‌వీబీసీ
  • ఈ కార్యక్రమాలకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు..
  • ఈ సేవల్లో భాగం కావడం పూర్వజన్మ సుకృతం
  • ఎస్‌వీబీసీ ఛానల్‌ ఛైర్మన్‌ శ్రీధర్‌ వర్మ..

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 15.09.2026 నుంచి 23.09.2026 వరకు తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే! శ్రీవారి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు బారులు తీరారు. స్వామికి జరిగే కైంకర్యాలను ప్రత్యక్షంగా భక్తులకు చూపించి భక్తులను తరింపజేయడంతో ఎస్‌వీబీసీ ఛానల్‌ వందశాతం సక్సెస్‌ అయిందని చైర్మన్‌ శ్రీధర్‌ వర్మ అన్నారు. ఈ మేరకు కార్యక్రమాలు నిర్వహించడంతో సహకరించిన ప్రతి ఒక్కరికీ శ్రీధర్‌వర్మ కృతజ్ఞతలు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ
‘తొమ్మిది రోజులపాటు బ్రహోత్సవాలు లక్షలాది మంది భక్తుల నడుమ ఎంతో వైభవంగా జరిగాయి. స్వామివారు వివిధ అలంకారాలు, వాహన సేవల్లో భక్తులను దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాలన్నీ భక్తులకు ఛానల్‌ ద్వారా లైవ్‌లో అందుబాటులో ఉంచాం. టిటిడి ఎస్వీబీసీకి ప్రోగ్రామ్స్ చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు నృత్య బృందాలు భక్తుల్ని అలరించారు. వారందరికీ
ధన్యవాదాలు. ఛానల్‌కు సంబంధించిన కెమెరా సిబ్బంది, లైవ్‌, యాంకర్లు.. ఇలా అన్ని శాఖలవారు ఈ తొమ్మిది రోజులు విశ్రాంతి లేకుండా కష్టపడ్డారు. తిరుమల కొండపై, మాఢవీదుల్లో సంచారకుల్లా తిరుగుతూ స్వామికి సంబంధించిన ప్రతి విషయాన్ని కెమెరాల్లో బంధించి భక్తుల ముందుకు తీసుకెళ్లారు. స్వామికి జరిగే వాహన సేవలు, నృత్యాలు తదితర అంశాలన్నీ యూట్యూబ్‌ షార్ట్స్‌, రీల్స్‌ రూపంలో టీటీడీ svbc సోషల్‌ మీడియా ద్వారా భక్తులకు అందుబాటు ఉంచాం. ఈ కార్యక్రమాలన్నీ ఛైర్మన్‌ హోదాలో దగ్గరుండి చూసుకునే అవకాశం దక్కడం నా పూర్వ జన్మ సుకృతం. దీనికి సహకరించిన టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడుగారికి, అధికారులు, సిబ్బంది అందరి సమన్వయ సహకారంతోనే భక్తులకు విస్తృత స్థాయిలో స్వామి కార్యక్రమాలను ఛానల్‌ ద్వారా భక్తుల ముందుకు తీసుకెళ్లగలిగాం’ అని శ్రీధర్‌ వర్మ అన్నారు.

ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అలాగే బోర్డు మెంబెర్స్‌ అందరికి ఎస్‌వీబీసీ తరపున కృతజ్ఞతలు. అలాగే ముద్దాడ రవిచంద్ర గారు, అడిషనల్‌ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు, తిరుపతి జిల్లా ఎల్‌ ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో శరత్‌ గారు, చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీవీఎస్‌ఓ) మురళీకృష్ణ గారు, అలాగే ఇతర అన్ని శాఖల వారికి ఎస్‌వీబీసీ తరపున పేరుపేరున కృతజ్ఞతలు. అలాగే స్వామి కార్యక్రమలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు చేరవేయడంలో ప్రింట్, ఎలెక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.