వైభవంగా ప్రారంభమైన “ఆదివారం” చిత్రం
జెఎస్ఆర్ క్రియేషన్స్ 999 బ్యానర్ పై సుబ్రమణ్యం చిగురుపాటి రచన దర్శకత్వంలో జెఎస్ రాజా రెడ్డి నిర్మాతగా ప్రారంభమైన చిత్రం ఆదివారం. ఈ చిత్రానికి సాకేత్ సినిమాటోగ్రఫీ బాధ్యతను చేపట్టగా ఎస్ఎస్ వెంకటేష్ సంగీతం అందిస్తున్నారు. దువ్వరపు వెంకటేష్ ఎడిటర్ గా పని చేయనున్న ఈ చిత్రంలో రఘు తేజ, సునీల్, తార, ఝాన్సీ ప్రముఖ పాత్రలు పోషిస్తుండగా విలాస్, అశోక్, సయ్యద్ మెహబూబ్ భాషా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్ర ప్రారంభం కాగా ప్రముఖ సినీ నిర్మాత కెఎస్ రామారావు గారు, రామ సత్యనారాయణ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమాకు స్క్రిప్ట్ నిర్మాత జెఎస్ రాజారెడ్డి గారు…
