Skip to content

వైభవంగా ప్రారంభమైన “ఆదివారం” చిత్రం

జెఎస్ఆర్ క్రియేషన్స్ 999 బ్యానర్ పై సుబ్రమణ్యం చిగురుపాటి రచన దర్శకత్వంలో జెఎస్ రాజా రెడ్డి నిర్మాతగా ప్రారంభమైన చిత్రం ఆదివారం. ఈ చిత్రానికి సాకేత్ సినిమాటోగ్రఫీ బాధ్యతను చేపట్టగా ఎస్ఎస్ వెంకటేష్ సంగీతం అందిస్తున్నారు. దువ్వరపు వెంకటేష్ ఎడిటర్ గా పని చేయనున్న ఈ చిత్రంలో రఘు తేజ, సునీల్, తార, ఝాన్సీ ప్రముఖ పాత్రలు పోషిస్తుండగా విలాస్, అశోక్, సయ్యద్ మెహబూబ్ భాషా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్ర ప్రారంభం కాగా ప్రముఖ సినీ నిర్మాత కెఎస్ రామారావు గారు, రామ సత్యనారాయణ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమాకు స్క్రిప్ట్ నిర్మాత జెఎస్ రాజారెడ్డి గారు దర్శకుడు సుబ్రమణ్యం గారికి అందచేయగా కెఎస్ రామారావు గారు క్లాప్ కొట్టారు, రామ సత్యనారాయణ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ సందర్భంగా రామ సత్యనారాయణ మాట్లాడుతూ… “దర్శకుడు నాకు ఎంతోకాలం నుండి పరిచయం ఉంది. గతంలో కూడా కొన్ని సినిమాలు చేశాడు. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. ఈ చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్. నెల్లూరు నుండి వచ్చిన ఈ దర్శకునికి, అలాగే కొత్త నటీనటులకు మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు నా పూర్తి సహకారం ఉంటుంది. ఈ సినిమా ప్రారంభానికి వచ్చి ఆశీర్వాదాలు ఇచ్చిన కెఎస్ రామారావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా దర్శకుడు జాగ్రత్తగా పూర్తి చేయాలని, మంచి పబ్లిసిటీ చేసి ప్రేక్షకులకి తీసుకుని వెళ్లాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందం అందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్” అన్నారు.

దర్శకుడు సుబ్రమణ్యం చిగురుపాటి మాట్లాడుతూ… “మా చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్య అతిథులు కెఎస్ రామారావు గారికి, రామ సత్యనారాయణ గారికి, మీడియా వారికి థాంక్స్. మాకు సపోర్ట్ ఇచ్చిన నిర్మాతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా సినిమాకు అందరూ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒక దర్శకునికి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలో అలా సపోర్ట్ చేశారు” అన్నారు.

జెఎస్ రాజారెడ్డి మాట్లాడుతూ… “నాకు సినిమా అంటే కొత్త కాదు. గతంలో రచనారంగంలో, ఆర్టిస్ట్ గా సినిమాలో చేశాను. గతంలో ఎన్ని హారర్ సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా పూర్తిగా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకుని వెళ్ళి, సినిమాను మంచి విజయం చేసే ప్రయత్నం చేస్తాము. ప్రేక్షకులు సినిమాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు తేజ మాట్లాడుతూ… “నన్ను గుర్తించి నాకు ఈ సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చిన దర్శకునికి థాంక్స్. ఈ సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది. సినిమా కోసం దర్శక నిర్మాతలు చాలా కష్టపడి ప్యాషన్ తో ఈ సినిమాను చేస్తున్నారు. నా తోటి నటీనటులకు ఆల్ ది బెస్ట్” అన్నారు.

నటి తారా మాట్లాడుతూ… “నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సినిమాలో నా బెస్ట్ ఇస్తాను. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరోసారి థాంక్స్” అన్నారు.

నటుడు సునీల్ మాట్లాడుతూ… “నాకు అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. నాకు సినిమా అంటే పిచ్చి. సినిమాలో నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తాను. అందరూ ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

నటి ఝాన్సీ మాట్లాడుతూ… “కొత్తగా వచ్చిన నాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మా సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను” అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొని ఇతర నటీనటులు, చిత్ర సాంకేతిక బృందం అందరూ ఈ సినిమాను మీడియా వారు సపోర్ట్ చేయాలని, ప్రేక్షకులు అందరూ ఆదరించాలని కోరుకున్నారు.

నటీనటులు : రఘు తేజ, సునీల్, తార, ఝాన్సీ, విలాస్, అశోక్, సయ్యద్ మెహబూబ్ భాషా తదితరులు.

సాంకేతిక బృందం :
బ్యానర్ : జెఎస్ఆర్ క్రియేషన్స్ 999
దర్శకుడు : సుబ్రమణ్యం చిగురుపాటి
డిఓపి : సాకేత్
సినిమాటోగ్రఫీ : ఎస్ఎస్ వెంకటేష్
ఎడిటర్ : దువ్వరపు వెంకటేష్
అసిస్టెంట్ ఎడిటర్ : నవనీత్
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.