‘సిగ్మా’ డబ్బింగ్ పూర్తి- శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు- జూలై 31 గ్రాండ్ గా రిలీజ్
లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్న 'సిగ్మా' సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దర్శకుడిగా జేసన్ సంజయ్ అరంగేట్రం చేస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 31న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. లైకా ప్రొడక్షన్స్ హెడ్ జి.కె.ఎం. తమిళ్ కుమరన్ మాట్లాడుతూ... "సిగ్మా ఇప్పుడు ఫైనల్ షేప్ తీసుకుంటుండటం మాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. జేసన్ సంజయ్‌ను దర్శకుడిగా పరిచయం చేయడం మా కోసం ఎంతో ప్రత్యేకమైన అనుభవం. ఇది ఆయన తొలి చిత్రం అయినప్పటికీ, ప్రతి దశలో ఆయన చూపించిన స్పష్టత, నమ్మకం, క్రమశిక్షణ, అనుభవజ్ఞుడైన…
