Skip to content

‘సూపర్ సుబ్బు’ ట్రైలర్ లాంచ్- జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘సూపర్ సుబ్బు’ ట్రైలర్ లాంచ్- జూలై 2 నుంచి  నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ Telugu News
‘సూపర్ సుబ్బు’ ట్రైలర్ లాంచ్- జూలై 2 నుంచి  నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ Telugu News

ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తన తొలి తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్‌ను విడుదల చేసింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ వినోదాత్మక కథలో సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు చిల్లుకూరి రావు అనే టీచర్ పాత్రలో సందీప్ కిషన్ ఆకట్టుకున్నారు. ఎలాంటి ఉపాధ్యాయుడూ వెళ్లాలని అనుకోని మాకిపూర్‌కు అతడికి పోస్టింగ్ వస్తుంది. కుటుంబం ముందు పరువు నిలబెట్టుకోవాలని భావించి అక్కడికి వెళ్లిన సుబ్బుకు ఊహించని విధంగా సెక్స్ ఎడ్యుకేషన్ బోధించే బాధ్యత అప్పగిస్తారు

ఆ తర్వాత జరిగే సంఘటనలు, గ్రామస్తులతో ఏర్పడే అపార్థాలు, హాస్యభరిత పరిస్థితులు కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తాయి. గ్రామాన్ని మార్చాలనుకున్న సుబ్బు, చివరికి ఆ గ్రామమే తన జీవితాన్ని మార్చేస్తుందనే ఎమోషల్ ఎలిమెంట్ ని కూడా ఈ సిరీస్ టచ్ చేస్తోంది .

ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ.. సూపర్ సుబ్బు సాధారణంగా ప్రజలు మాట్లాడటానికి సంకోచించే అంశాన్ని హాస్యం, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో చెప్పే ప్రయత్నం. సుబ్బు ఒక సమస్యను పరిష్కరించాలనుకుని చివరికి మరిన్ని సమస్యల్లో చిక్కుకుంటాడు. ఉద్యోగ సమస్యలు, ప్రేమలో ఎదురయ్యే ఇబ్బందులు, కుటుంబ ఒత్తిళ్లు, గ్రామస్తులతో వచ్చే అపార్థాలు కథను మరింత వినోదాత్మకంగా మారుస్తాయి. మాకిపూర్‌లోని ప్రతి పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్‌లో భాగం కావడం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి”

మిథిలా పాల్కర్ మాట్లాడుతూ.. హాస్యంతో పాటు మానవ సంబంధాలు, అంగీకారం, పరస్పర అవగాహన వంటి అంశాలను ఎంతో అందంగా చెప్పిన కథ ఇది. మల్లిక్ రామ్ క్రియేట్ చేసిన మాకిపూర్ ప్రపంచం జీవంతో నిండిపోయి ఉంటుంది. ప్రేక్షకులకు వినోదంతో పాటు మంచి అనుభూతిని అందించే ఈ సిరీస్‌లో భాగం కావడం ఆనందంగా ఉంది. నెట్‌ఫ్లిక్స్‌తో నా అనుబంధం ‘లిటిల్ థింగ్స్’ నుంచి ప్రారంభమై, ఇప్పుడు వారి తొలి తెలుగు ఒరిజినల్ ‘సూపర్ సుబ్బు’ వరకు రావడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది”

సుబ్బు తండ్రి కుకటేశ్వరరావు పాత్రలో నటించిన మురళీ శర్మ మాట్లాడుతూ.. ప్రేక్షకులను నవ్విస్తూనే సాధారణంగా దూరంగా పెట్టే కొన్ని అంశాలపై చర్చకు దారి తీసే కథ ఇది. కామెడీ, కుటుంబ బంధాలు, సామాజిక అంశాలను ఎంతో సహజంగా మేళవించారు. మాకిపూర్‌లోని ప్రతి పాత్ర కథకు ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చింది. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్‌లో భాగం కావడం ఆనందంగా ఉంది.

మల్లిక్ రామ్, రమేష్ ఎలిగేటి, శివాని ధోబాల్ రచించిన ఈ సిరీస్‌ను చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి నిర్మించారు. గెటప్ శ్రీను, మానసా చౌదరి, జీవన్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు.

హాస్యం, భావోద్వేగాలు, చిన్న పట్టణ జీవనశైలిలోని సరదా సంఘటనలను మేళవిస్తూ రూపొందిన ‘సూపర్ సుబ్బు’ ప్రేక్షకులకు ఓ వినూత్న అనుభూతిని అందించనుంది.

సూపర్ సుబ్బు జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.