‘మా ఇంటి బంగారం’ టీమ్‌ను అభినందించిన చిరంజీవి, సురేఖ
జూన్ 19న విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను వసూలు చేసింది. ఇప్పుడు ఈ సెన్సేషనల్ సక్సెస్‌ను టీమ్ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో వారికి వారి ఎనర్జీని, ఉత్సాహాన్ని పెంచే సంఘటన జరిగింది... అదే ‘మెగా బంగారం’ మూమెంట్. సూపర్ డూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబడుతూ దూసుకెళ్తోన్న ‘మా ఇంటి బంగారం’ ఘన విజయాన్ని అభినందిస్తూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. ‘‘‘మా ఇంటి బంగారం’ సినిమాను చూస్తున్నంత సేపు చాలా ఆసక్తికరంగా అనిపించింది. జాయింట్ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్, ఎమోషన్స్‌ని చాలా బాగా మిక్స్ చేస్తూ డైరెక్టర్ నందినీ రెడ్డి తన స్టైల్లో సినిమాను…
