‘టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్’ ఫైనల్లో విజేతగా గౌతమ్
తెలుగువారి ఫేవరేట్ ఓటీటీ ఆహా తాజా ఒరిజినల్ షో ‘టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్’ తొలి సీజన్ ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన గ్రాండ్ ఫినాలేలో గౌతమ్ విజేతగా నిలిచారు. ఈ ఫైనల్లో షోకు చెందిన ఆరుగురు ఫైనలిస్టులతో పాటు లైవ్ ఆడియన్స్, స్పెషల్ జడ్జ్ గా ప్రముఖ డైరెక్టర్, యాక్టర్ తరుణ్ భాస్కర్ పాల్గొన్నారు. తెలుగు ఎంటర్టైన్మెంట్లో సరికొత్త ఫార్మాట్‌గా రూపొందిన ‘టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్’ కంప్లీట్ గా ఇన్ఫ్లుయెన్సర్లు, క్రియేటర్లతో ఒక కొతత్ ఎంటర్ టైన్ మెంట్ వరల్డ్ ను క్రియేట్ చేసింది ఆహా. 8 ఎపిసోడ్లుగా సాగిన ఈ షోలో వివిధ రంగాలకు చెందిన క్రియేటర్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, డిఫరెంట్ థీమ్స్, ఫార్మాట్స్‌లో కంటెస్టెంట్స్ ఛాలెంజెస్ ఫేస్ చేశారు. వారి…
