Skip to content

‘వార్ 2’.. కొత్త పోస్టర్ రిలీజ్

బ్లాక్‌బస్టర్ YRF స్పై యూనివర్స్ నుంచి రానున్న ‘వార్ 2’ గురించి ప్రస్తుతం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ యాక్షన్ ఓరియెంటెడ్ స్పై డ్రామాని యష్ రాజ్ ఫిల్మ్స్ గ్రాండ్‌గా నిర్మించిందది. ఈ ‘వార్ 2’ చిత్రం మరో ముప్పై రోజుల్లో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే. ఈ హై-ఆక్టేన్ స్పై థ్రిల్లర్ ఆగస్టు 14న తెరపైకి గ్రాండ్‌గా రానుంది. ‘వార్ 2’ ముప్పై రోజుల్లో రానుందని తెలిసేలా మేకర్లు తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ప్రధాన పాత్రల్ని చూపించిన తీరు ఆకట్టుకుంటోంది. ఈ త్రయానికి చిత్రంలో…

Read more

ఆశ షూటింగ్ ప్రారంభం

మలయాళ సినిమా పాపులర్ యాక్టర్స్ ఊర్వశి, జోజు జార్జ్ కలిసి క్రేజీ మల్టీ లింగ్వల్ మూవీ ఆశలో నటిస్తున్నారు. అజిత్ వినాయక ఫిల్మ్స్ సమర్పణలో, వినాయక అజిత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సఫర్ సనల్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. జోజు జార్జ్, రమేష్ గిరిజ, సఫర్ సనల్ సంయుక్తంగా స్క్రీన్ ప్లే, సంభాషణలు రాశారు. త్రిక్కక్కర వామన మూర్తి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంతో ఈ చిత్రం ప్రారంభమైంది. జోజు జార్జ్, సినిమాటోగ్రాఫర్ మధు నీలకందన్, దర్శకుడు సఫర్ సనల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. జోజు జార్జ్ క్లాప్ కొట్టగా, మధు నీలకందన్ కెమరా స్విచ్-ఆన్ చేశారు. ఈ వేడుకలో ఆశ టైటిల్-లుక్ పోస్టర్ లాంచ్ చేశారు, ఇది ఆడియన్స్…

Read more

జూనియర్‌’ ఖచ్చితంగా అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది: హీరోయిన్ జెనీలియా

ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ 'జూనియర్‌'తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్‌ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ డివోపీగా పని చేస్తున్నారు. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత సౌత్ సినిమా సినిమా…

Read more

“శ్రీమద్ భాగవతం పార్ట్-1” షూటింగ్ ప్రారంభం

సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఆకాష్ సాగర్ చోప్రా నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న‌ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం "శ్రీమద్ భాగవతం పార్ట్-1" సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించే ఒక గొప్ప ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు . "శ్రీమద్ భాగవతం" వంటి గాఢమైన ఆధ్యాత్మిక కథాంశం ఆధారంగా రూపొందుతున్న‌ ఈ సినిమా ప్రేక్షకులకు స‌రికొత్త అనుభవాన్ని అందించనుంది. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక రామోజీ ఫిల్మ్ సిటీలో "శ్రీమద్ భాగవతం పార్ట్-1" చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జూలై 14,2025న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్…

Read more

‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. : డైరెక్టర్ ప్రవీణ పరుచూరి

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న రూరల్ కామెడీ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్‌, టీజర్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రవీణ పరుచూరి సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీరు నిర్మాత, నటి కదా.. డైరెక్షన్ వైపు రావాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది? ? -నాకు…

Read more

ఉసురే’ ట్రైలర్‌ విడుదల

యదార్థ సంఘటనలతో, సమాజంలో జరిగిన వాస్తవ కథను తెరపై ఆసక్తికరంగా చూపిస్తే ఆ చిత్రాలు తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతాయి. ఇప్పుడు ఈ కోవలోనే యదార్థ సంఘటనలతో రూపొందిన ఓ వైవిధ్యమైన గ్రామీణ ప్రేమకథగా 'ఉసురే' ఆగస్టు 1న థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టీజయ్‌ అరుణాసలం, జననీ కునశీలన్‌ హీరో, హీరోయిన్స్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి నవీన్‌ డి.గోపాల్‌ దర్శకుడు. శ్రీకృష్ణ ప్రొడక్షన్స్‌ సమర్పణలో బకియా లక్ష్మీ టాకీస్‌ పతాకంపై మౌళి ఎం రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 1న విడుదల చేస్తున్నారు మేకర్స్‌. సీనియర్‌ హీరోయిన్‌ రాశి ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు…

Read more

ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో ‘హరి హర వీరమల్లు’లో పవన్ కళ్యాణ్ పాత్ర

పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు' జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు జ్యోతి కృష్ణ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. 'హరి హర వీరమల్లు' చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించడానికి దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఎంజీఆర్ ల నుండి ప్రేరణ పొందానని జ్యోతి కృష్ణ వెల్లడించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజ వ్యక్తుల మాదిరిగానే పవన్‌ కళ్యాణ్ లో ఉన్న అద్భుతమైన లక్షణాలను గమనించిన తర్వాతే ఆయన పాత్రను రాయడానికి ప్రేరణ పొందానని జ్యోతి కృష్ణ పేర్కొన్నారు. ధర్మపరుడిగా, బలవంతుడిగా మరియు ప్రజల మనిషిగా పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ ను…

Read more

సయారా’తో ‘ఆషికి’ రోజుల్ని తలుచుకోవడం ఆనందంగా ఉంది : మహేష్ భట్

భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఫిల్మ్ మేకర్స్‌లో ఒకరైన మహేష్ భట్ తాజాగా ‘సయారా’పై స్పందించారు. మహేష్ భట్ తీసిన ‘ఆషికి’ చిత్రంతో రాహుల్ రాయ్, అను అగర్వాల్‌లు ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారన్న సంగతి తెలిసిందే. ఆషికి ఇప్పటికీ, ఎప్పటికీ ఇండియన్ స్క్రీన్స్‌పై ఓ ఎవర్ గ్రీన్ క్లాసికల్ లవ్ స్టోరీగా నిలిచిపోతుంది. ఆషికి చిత్రానికి సంబంధించిన సంగీతం కూడా బ్లాక్ బస్టర్‌గా ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తూనే ఉంటుంది. అదేవిధంగా YRF తదుపరి హీరో, హీరోయిన్‌లుగా అహాన్ పాండే, అనీత్ పద్దాలను ‘సయారా’తో పరిచయం చేయబోతోన్నారు. ఇప్పటికే ‘సయారా’ పాటలు బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. ‘సయారా’ గురించి మహేష్ భట్ మాట్లాడుతూ .. ‘ప్రతి తరానికి ఒక ప్రేమకథ ఉంటుంది. ఆ తరానికి…

Read more

హాట్‌కేక్‌లా అమ్ముడైన మై బేబి మూవీ పంపిణీ హక్కులు

తమిళంలో ఘన విజయం సాధించిన ‘డీఎన్‌ఏ’ సినిమా తెలుగులో ‘మై బేబి’ పేరుతో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా పంపిణీ హక్కులు హాట్‌కేక్‌ల్లా అమ్ముడవడంతో 350 కు పైగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ఈ ఎమోషనల్ డ్రామాను నెల్సన్ వెంకట్ దర్శకత్వం వహించారు. నిమిషా సజయన్, అథర్వ మురళి కీలక పాత్రల్లో నటించారు. నిర్మాత సురేష్ కొండేటి... ఎస్‌కె పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’, ‘పిజ్జా’ వంటి విజయవంతమైన అనువాద చిత్రాలను అందించిన సురేష్ కొండేటి.. సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్‌తో సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. జూలై 18న 350 కు…

Read more

నరసింహ నంది “ప్రభుత్వ సారాయి దుకాణం” ఫస్ట్ లుక్ విడుదల !!!

జాతీయ అవార్డ్ దర్శకులు నరసింహ నంది దర్శకత్వంలో వచ్చిన 1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా లాంటి ఉత్తమ విలువలు కలిగిన సినిమాల తరువాత నరసింహ నంది తాజాగా ఎస్విఎస్ ప్రొడక్షన్స్ , శ్రీనిధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది, ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్న కుమార్, దర్శకులు సముద్ర, నటుడు పృద్వి తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. సెక్స్పియర్ కథలోని పాత్రల ఆధారంగా తీసుకొని తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగే పొలిటికల్ ఫ్యామిలీ ఇతివృత్తంగా పగ ద్వేషం, ఈర్ష, అసూయ, ప్రేమ మనిషిలోని వివిధ కోణాలను చూపిస్తూ ప్రభుత్వం సారాయి దుకాణం…

Read more