ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ లో సందడి చేసిన రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ లో సందడి చేశారు. రెహమాన్ కాన్సర్ట్ రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరిగింది. అతిథులుగా హాజరైన రామ్‌చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సానా ఆడియన్స్ లో మరింత జోష్ నింపారు. ‘పెద్ది’ సినిమాలోని చికిరి చికిరి లైవ్ పెర్ఫామెన్స్ ని ఆడియన్స్ నుంచి అద్భుతమై రెస్పాన్స్ వచ్చింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. రెహమాన్ గారి సంగీతంలో భాగమవ్వాలనేది నా చైల్డ్‌హుడ్ డ్రీం. అది నా ప్రాజెక్ట్ ‘పెద్ది’ తో నెరవేరినందుకు చాలా ఆనందంగా వుంది. జాన్వి కపూర్ మాట్లాడుతూ.. పెద్ది సినిమాలో భాగమయ్యే అవకాశం రావడం…
