*తెలుగులోనూ రాణించాలన్నదే* *తన ధ్యేయమంటున్న* *కన్నడ భామ రూపాలి ఎస్.డి*
ఐశ్వర్యారాయ్, శిల్పా శెట్టి మొదలుకుని... అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్న వరకు- ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కన్నడ భామల హవా నడుస్తోంది. ఆ జాబితాలో తన పేరు కూడా చేర్చుకోవాలని తహతహలాడుతోంది తెలుగు మూలాలు కలిగిన కన్నడ భామ రూపాలి ఎస్.డి. నాట్యంలో మంచి ప్రావీణ్యురాలైన ఈ అమ్మడు... అభినయంలోనూ శిక్షణ పొంది, మోడలింగ్ ద్వారా దర్శకనిర్మాతల దృష్టిని విశేషంగా ఆకర్షించింది!! కన్నడలో "గంగి గౌరి, తారకేశ్వర్" చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ... "కోరా" అనే చిత్రంలో డేరింగ్ పోలీస్ ఆఫీసర్ గా యాక్ట్ చేసి, మంచి మార్కులు కొట్టేసింది. ఈ చిత్రం తెలుగులో అదే పేరుతో త్వరలో విడుదల కానుంది!! ఈ భామ…