Skip to content
‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ Telugu News

‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

జియో హాట్ స్టార్‌లో ‘సేవ్ ది టైగర్స్’కి వచ్చిన స్పందన అందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు మూడో సీజన్ స్ట్రీమింగ్‌కి రెడీ అయింది. జూన్ 19 నుంచి ఈ మూడో సీజన్ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో అందరినీ ఆకట్టుకునేలా, వినోదభరితమైన ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఎవరన్నా.. చిన్నప్పటి నుంచి పెళ్లి గురించి మనకు ఇన్ని అబద్దాలు చెప్పింది.. పెళ్లి అంటే పండు వెన్నెల, పెళ్లాం అంటే నిండు పున్నమి’ అని రాహుల్ పాత్రలో అభినవ్ గోమటం చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ఓపెన్ అవుతుంది. బార్‌లో రాహుల్ (అభినవ్ గోమటం), విక్రమ్ (కృష్ణ చైతన్య), ఘంటా రవి (ప్రియదర్శి)…

Read more
జీ5లో ట్రెండింగ్ టాప్-1గా  ‘డ్రింకర్ సాయి’ ధర్మ మహేష్ నటనకు ప్రేక్షకుల ప్రశంసలు Telugu News

జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ‘డ్రింకర్ సాయి’ ధర్మ మహేష్ నటనకు ప్రేక్షకుల ప్రశంసలు

ధర్మ మహేష్ హీరోగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్ర్కీన్ ఎంటర్‌‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. “బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్” అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై యూత్, మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ తన విజయయాత్రను కొనసాగిస్తోంది. జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఫ్రీ ఆన్ జీ5 విభాగంలో టాప్-1 ట్రెండింగ్ మూవీగా దూసుకుపోతూ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో ధర్మ మహేష్ కనబరిచిన అద్భుత నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్…

Read more
‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – వీఎన్ ఆదిత్య Telugu News

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – వీఎన్ ఆదిత్య

‘మన డాక్టర్ బాబే’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లా ఉంటుంది - టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీ స్కంద శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు టీజర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌‌కు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ .. ‘‘మన డాక్టర్ బాబే’ టీజర్ ఆద్యంతం వినోదభరితంగా ఉంది. ఇలాంటి మంచి కామెడీ సినిమాలు…

Read more
యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు “టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ – 2026” నిర్వహిస్తున్నాం : టీఎఫ్‌సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ Telugu News

యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు “టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ – 2026” నిర్వహిస్తున్నాం : టీఎఫ్‌సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్

* జూన్ 13 వరకు ఉచితంగా ఎంట్రీలు పంపే అవకాశం * జూన్ 21న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో అవార్డుల ప్రధానోత్సవం చిత్ర పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని "టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ – 2026" ను టీఎఫ్‌సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రకటించారు. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. 5 నుంచి 25 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలింలను ఔత్సాహిక దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు పంపవచ్చు. ఎంట్రీలను జూన్ 13వ తేదీ వరకు స్వీకరిస్తారు. జ్యూరీ ఎంపిక చేసిన విజేతలకు…

Read more
దర్శక రత్న దాసరి నారాయణరావు గారి స్మారక స్థలాన్ని శుభ్ర పరిచిన విష్ణు మంచు టీం Telugu News

దర్శక రత్న దాసరి నారాయణరావు గారి స్మారక స్థలాన్ని శుభ్ర పరిచిన విష్ణు మంచు టీం

"ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గారి స్మారక స్థలం శిధిలావస్థలో ఉందని చూపించిన ఒక వీడియోను చూసిన వెంటనే విష్ణు మంచు స్పందించారు. ఆలస్యం చేయకుండా తన బృందాన్ని అక్కడికి పంపించి, స్మారక స్థలం పరిసరాలను శుభ్రపరచడంతో పాటు పునరుద్ధరణ చర్యలు చేపట్టేలా ఆదేశించారు. వారి చొరవతో ఆ ప్రదేశం తిరిగి పరిశుభ్రంగా, గౌరవప్రదమైన స్థితికి చేరుకుంది. దాసరి నారాయణరావు గారి వారసత్వానికి తగిన గౌరవాన్ని అందించేలా ఈ చర్యలు చేపట్టడం విశేషం."

Read more
కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026 ఘనంగా నిర్వహణ Telugu News

కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026 ఘనంగా నిర్వహణ

తెలుగు చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలందించిన కళాకారులు, సాంకేతిక నిపుణులను సత్కరించేందుకు నిర్వహించిన “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026” కార్యక్రమం హైదరాబాద్‌లోని AAA సినిమాస్, అమీర్‌పేట్‌లో ఘనంగా జరిగింది. సినీ, సాంస్కృతిక, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి స్మారకార్థం నిర్వహించిన ఈ అవార్డుల వేడుకలో పలువురు సినీ ప్రముఖులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC) ఛైర్మన్ భరత్ భూషణ్ గారు, APFDC డైరెక్టర్ మరియు ప్రముఖ నిర్మాత చడలవాడ శ్రీనివాస్ రావు గారు,…

Read more
నాని లాంచ్ చేసిన ‘ఇట్లు అర్జున’ ఫస్ట్ సింగిల్ ‘హాయ్ రే’ రిలీజ్ Telugu News

నాని లాంచ్ చేసిన ‘ఇట్లు అర్జున’ ఫస్ట్ సింగిల్ ‘హాయ్ రే’ రిలీజ్

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’. “న్యూ గై ఇన్ టౌన్” అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది అనౌన్స్‌మెంట్ వీడియో, ప్రోమోతో అంచనాలు పెంచిన మేకర్స్, తాజాగా ఫస్ట్ సింగిల్‌ హాయ్ రే ను విడుదల చేస్తూ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన ఈ పాట యూత్‌ఫుల్ ఎనర్జీతో, క్యాచీ ట్యూన్‌తో ఆకట్టుకుంటోంది. ఎస్. థమన్ ఈ పాటను స్ట్రాంగ్ ఎలక్ట్రానిక్, హిప్‌హాప్ బీట్స్‌తో ఫాస్ట్ పేస్డ్…

Read more
“రోమాంచకం” మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ Telugu News

“రోమాంచకం” మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ రూపొందించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ పై తన సోదరుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ప్రతి చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా. ఈ సెన్సేషనల్ బ్రదర్స్ ఒక యంగ్ టీమ్ తో సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఆ ప్రాజెక్ట్ తప్పకుండా మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తుంది, అందరిలో అంచనాలు పెంచేస్తుంది. అలాంటి క్రేజీ సినిమానే "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండగా, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు…

Read more
‘సిగ్మా’ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ Telugu News

‘సిగ్మా’ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్

లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘సిగ్మా’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. అనౌన్స్మెంట్ నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా, టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది. టీజర్ ఇప్పటికే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సినిమాపై అంచనాలను పెంచింది. లైకా ప్రొడక్షన్స్ హెడ్ జి.కె.ఎం తమిళ్ కుమరన్ మాట్లాడుతూ.. “జూలై 31న ‘సిగ్మా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉంది. సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులకు ఇది ఒక కొత్త సినీ అనుభూతిని అందిస్తుందని నమ్ముతున్నాం…

Read more
ముద్దం న‌ర‌సింహ స్వామికి ప్రతిష్టాత్మక ‘గౌతమ బుద్ధ సేవారత్న’   అవార్డు ప్రదానం Telugu News

ముద్దం న‌ర‌సింహ స్వామికి ప్రతిష్టాత్మక ‘గౌతమ బుద్ధ సేవారత్న’ అవార్డు ప్రదానం

హైదరాబాద్‌: ఏఐ పుస్తకాల రచయిత, ప్రముఖ జర్నలిస్టు ముద్దం న‌ర‌సింహ స్వామికి ప్రతిష్టాత్మక ‘గౌతమ బుద్ధ సేవారత్న అవార్డు’ ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా జరిగిన TMBMWA 5వ వార్షికోత్సవ వేడుకల్లో ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, గోపా అధ్యక్షుడు బండి సాయన్న తదితర ప్రముఖులు హాజరయ్యారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ మీడియా రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ, సమాజానికి తనవంతు సహకారం అందిస్తున్నందుకు ముద్దం న‌ర‌సింహ స్వామిని వేదికపై ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా TMBMWA సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మీడియా, సాంకేతిక రంగాల్లో ముద్దం న‌ర‌సింహ…

Read more