Skip to content

‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ సెప్టెంబర్ 4న తెలుగులో రిలీజ్

నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ లో ఫన్ లవ్ ఎంటర్ టైమెంట్ అదిరిపోయింది. నివిన్ పౌలీ జస్టిన్ పాత్రలో కనిపించారు. 2005లో ఆన్‌లైన్‌లో క్యాసెట్ పాటలను కన్వర్ట్ చేసి అప్‌లోడ్ చేస్తూ తనకు తానే ‘MP3King’ అనే పేరు పెట్టుకున్న జస్టిన్ పాత్రలో పరిచయం కావడం ఆకట్టుకుంది. మమితా బైజు కాలేజీ విద్యార్థినిగా, గిటార్…

Read more

సరికొత్త ఒరిజినల్స్ తో ప్రేక్షకులకు చేరువ కానున్న తెలుగు జీ5

ఎన్‌బీకే111, వృషకర్మ, జనవరి 12 విడుదల నుంచి పంచనామా, జయమ్ము నిశ్చయమ్మురా 2 వరకు.. దక్షిణాది ప్రేక్షకుల మనసుకు చేరువయ్యే విభిన్నమైన, నెటివిటీ కథలతో ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త వినోదాన్ని అందించ‌నున్న తెలుగు జీ5 భారతీయ వినోద రంగం భవిష్యత్ వైవిధ్య‌మైన భాషాల‌తో, క్రియేటివిటీతో, కొత్త హ‌ద్దుల‌ను నిర్దేశిస్తూ ముందుకు సాగుతోంది. ఈ జ‌ర్నీలో క్రియేట‌ర్స్ ప్ర‌తిభ ఎంతో కీల‌కంగా మారింది. అందులో భాగంగా ఇప్పుడు తెలుగు జీ5 తన కంటెంట్‌ను మరో స్థాయికి తీసుకెళ్తూ.. ఐకానిక్ ఫ్రాంచైజీలు, ఒరిజినల్ సిరీస్‌లు, భారీ చిత్రాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, గతంలో ఎన్నడూ లేనంత విస్తృతమైన వినోద అనుభవాలతో కూడిన భారీ కంటెంట్ లైనప్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇండస్ట్రీలో అత్యంత నిబద్ధతతో, నాణ్యమైన కంటెంట్‌ను ఆదరించే…

Read more

రోజా క‌మ్ బ్యాక్ ఫిల్మ్ ‘అన్బే డ‌యానా’.. సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అన్బే డయానా’ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఇప్పుడు సోనీ లివ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ, కామెడీ, మ‌న నెటివిటీకి, మ‌న‌ సంస్కృతి, కుటుంబ అనుబంధాల మేళవింపుగా రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు మరింత విస్తృత ప్రేక్షకులకు చేరువ కానుంది. ప్రేక్షకులు తమ ఇంటి నుంచే ఈ అందమైన కథను ఆస్వాదించే అవకాశం. చెన్నైలోని పెరంబూర్ నేపథ్యంగా తెరకెక్కిన ‘అన్బే డయానా’ సినిమా కథ, సంప్రదాయాలకు కట్టుబడి ఉండే ఓ యువకుడి జీవితంలో చోటుచేసుకునే ఊహించని మలుపుతో ఏం జరిగింద‌నే పాయింట్‌ చుట్టూ సాగుతుంది. స్వేచ్ఛగా జీవించే ఓ ఆంగ్లో-ఇండియన్ యువతితో అతడు ప్రేమలో పడటంతో రెండు విభిన్న ప్రపంచాలు…

Read more

‘ది ప్యారడైజ్’ నుంచి ‘యెష నాగుల’ సాంగ్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా యాక్షన్ ఎక్స్‌ట్రావ్యాగెంజా ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’, ఇటీవల విడుదలైన టీజర్‌తో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘ఆయా షేర్’ కు వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత మేకర్స్ ‘యెష నాగుల’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జానపద బాణీకి అనిరుధ్ తనదైన హై-ఎనర్జీ మ్యూజిక్‌ను జోడించిన ఈ పాటను డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ కాన్సర్ట్‌లో లైవ్‌గా విడుదల చేశారు. వేలాది మంది అభిమానుల మధ్య పాటను లైవ్‌లో ప్రదర్శించగా, ప్రేక్షకులు డ్యాన్స్ చేస్తూ,…

Read more

“ఒరిజినల్ మాన్ స్టర్” మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్

ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ తో ఆసక్తి రేపుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్ టైనర్ కన్నడ చిత్ర పరిశ్రమలో లెజెండ్ గా ప్రేక్షకాభిమానం పొందిన శాండల్ వుడ్ కింగ్ డా.శివరాజ్ కుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "ఒరిజినల్ మాన్ స్టర్". ఈ క్రేజీ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఆర్ చంద్రూ రూపొందిస్తున్నారు. ఆర్ సి స్టూడియోస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఆనంద్ పండిట్ సమర్పణలో యమున చంద్రూ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ నటుడు సునీల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. "ఒరిజినల్ మాన్ స్టర్" సినిమా ఫస్ట్ లుక్,…

Read more

‘బిల్లా రంగా బాషా: ది ఫస్ట్ బ్లడ్’ సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీ

సూపర్‌స్టార్ బాద్‌షా కిచ్చా సుదీప్ ప్రతిష్టాత్మక పీరియడ్-యాక్షన్ స్పెక్టకిల్ ‘బిల్లా రంగా బాషా: ది ఫస్ట్ బ్లడ్’ థియేట్రికల్ రిలీజ్ దిశగా యూనిక్ ప్లానింగ్‌తో ముందుకు సాగుతోంది. అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్న ఈ హై-బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ వినూత్నమైన ప్రమోషనల్ క్యాలెండర్‌ను ప్రకటించారు. ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్ 2026 సెప్టెంబర్ 2 నుంచి 2027 చివరి క్యార్టర్లో సినిమా విడుదలయ్యే వరకు కొనసాగనుంది. సుదీప్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2, 2026న ఈ ప్రచార కార్యక్రమం అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించనున్నారు. తాజాగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్…

Read more

నాగార్జున మైల్‌స్టోన్ మూవీ కి ‘కింగ్ 100’ టైటిల్

కింగ్ నాగార్జున మైల్‌స్టోన్ 100వ చిత్రం #కింగ్ 100, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో, రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా పవర్‌ఫుల్ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. నాగార్జున వాయిస్‌ఓవర్‌తో ప్రారంభమయ్యే గ్లింప్స్‌లో సమాజం మనుషులను వారి సంపద ఆధారంగా ఎలా విభజిస్తుందనే అంశాన్ని ఆసక్తికరంగా ప్రస్తావించారు. తన దగ్గర ఏమీ లేనప్పుడు తనను ‘లూజర్’ అని పిలిచారని, అదే సంపద సంపాదించిన తర్వాత ‘ది కింగ్’ అని పిలుస్తున్నారని నాగార్జున చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. మరోవైపు నాగార్జున ఫొటోతో పాటు రూ.50,000 కోట్ల భారీ స్కామ్‌కు సంబంధించిన వార్తను చూపించడం సినిమాపై మరింత ఆసక్తిని…

Read more

ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ ని కలిసిన సంగీత దర్శకుడు కోటి

ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్విబిసి) చైర్మన్ గా ఎంపికైన శ్రీధర్ వర్మ గారిని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గౌరవపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సాహిత్య పరంగా తన వంతు సేవను అందిస్తానని కోటి అన్నారు. చైర్మన్ శ్రీధర్ వర్మ గారు, సంగీత దర్శకుడు కోటి కలిసి ఈ విషయాలపై చర్చలు జరిపారు. ఎస్విబిసి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందుతుందని కోటి ఆకాంక్షిస్తూ ఆయనను కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ గారు సంగీత దర్శకుడు కోటి గారిని సత్కరించడం జరిగింది.

Read more

‘ముగ్గురు కోతులు’ టైటిల్ సాంగ్ రిలీజ్

జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’. ఈ మూవీలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్య పాత్రల్ని పోషిస్తుండగా.. వర్షిక పాశం హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి రీసెంట్‌గా టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘ముగ్గురు కోతులు’ అంటూ సాగిన ఈ వీడియో సాంగ్‌‌లో ముగ్గురు హీరోలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. బ్యాచిలర్, సింగిల్ లైఫ్‌లు ఎలా ఉంటాయో ఈ వీడియో సాంగ్‌లో కనిపిస్తుంది. యూత్ ఫుల్ ఫన్ ఓరియెంటెడ్‌గా సినిమా…

Read more

వైభవంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్

సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రం.. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో . ఆర్ట్ డైరెక్టర్ భార్గవాచారి నౌండ్ల మాట్లాడుతూ - ‘ధర్మస్థల నియోజకవర్గం’ చాలా మంచి మూవీ. సెప్టెంబర్…

Read more