Skip to content

“గోల్డ్ స్పాట్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్ తమ సంస్థలో కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయకృష్ణ లింగమనేని ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ ను ఈ రోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి "గోల్డ్ స్పాట్" టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రొడ్యూసర్ రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. శ్రీ చౌదరి ఇనగంటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దుష్యంత్ దగ్గర వర్క్ చేసిన వేణు కార్తికేయన్ "గోల్డ్ స్పాట్" సినిమాతో దర్శకుడిగా…

Read more

‘వేట’..పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

ఎస్ఆర్‌డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వేట’. సందీప్ సరోజ్, సాత్విక జంటగా ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీని సోమవారం (ఆగస్ట్ 31) నాడు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాలకు కొణిదెల నాగబాబు, కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్‌కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అందజేయగా.. కేఎస్ రవి కుమార్ క్లాప్ కొట్టారు. సాయి రాజేష్, ఎస్‌కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో మెహర్ రమేష్, యదు వంశీ, అనుదీప్ దేవ్ పాల్గొన్నారు…

Read more

#NBK111 సెప్టెంబర్ 6న టైటిల్ అనౌన్స్‌మెంట్

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేని మోస్ట్ ఎవైటెడ్ మూవీ #NBK111 కోసం మరోసారి జతకట్టారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజున విడుదలైన "ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా" ఫస్ట్ గ్లింప్స్‌తో భారీ అంచనాలు రేకెత్తించింది. బాలయ్య పవర్ ఫుల్ అవతార్‌లో అదరగొట్టారు. #NBK111 నుంచి మరో పెద్ద అప్‌డేట్ రాబోతోంది. చిత్ర నిర్మాతలు సెప్టెంబర్ 6వ తేదీన టైటిల్, విడుదల తేదీని ప్రకటించనున్నారు. గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి ప్రేక్షకులు ఈ సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'వీర సింహారెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ కావడంతో మరిన్ని…

Read more

“రోమాంచకం” సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు – అనంతిక సనిల్ కుమార్

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు ఈ సినిమా సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విశేషాలను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్. - 8 వసంతాలు సినిమా తర్వాత చాలా స్క్రిప్ట్స్ నా దగ్గరకు వచ్చాయి. ఎన్నో…

Read more

‘కూర్మ అవతార్’ సినిమాలో భాగం కావడం అదృష్టం: శివరాజ్ కుమార్

కూర్మ అవతార్ టీజర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ నిర్మాత దిల్ రాజు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో హర్ష వర్ధన్ కడియాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కూర్మ అవతార్'. నరేంద్ర కొండ సమర్పణలో పంచవక్త్ర పిక్చర్స్ & రుక్వీణ స్టూడియోస్ బ్యానర్స్ పై పూజిత, సేవిత నిర్మిస్తున్నారు. రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్‌కుమార్, సాయి కుమార్, శివాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీజర్ లాంచ్ ఈవెంట్…

Read more

“హతః” టైటిల్ అనౌన్స్ మెంట్, పోస్టర్ రిలీజ్

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించారు. బ్యానర్ పై ఇటీవల తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను నిర్మించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం సమర్పణలో అనుష్ గోరక్ డైరెక్ట్ చేస్తున్నారు. శివశంకర నాయుడు. వై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కుష్లు, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి "హతః" అనే టైటిల్ ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ రోజు ఈ చిత్ర…

Read more

‘డాయ్‌రా’ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల‌

- జంగ్లీ పిక్చర్స్, డాక్టర్ జయంతీలాల్ గడా (పెన్ స్టూడియోస్) సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘డాయ్‌రా’ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘డాయ్‌రా’ మూవీ ట్రైలర్ విడుదలైంది. నిజం ఎప్పుడూ ఒకేలా ఉండదని, న్యాయం ఎవరి కోణంలో వారు ఎలా అర్థం చేసుకుంటారనేదానిపై ఆధారపడి ఉంటుందని, ప్రతి నిర్ణయం వెనుక ఓ ఘ‌ట‌న ఉంటుంద‌నే అంశాలను ఈమూవీ ట్రైలర్‌లో ఆస‌క్తిక‌రంగా చూపించారు. సెప్టెంబర్ 18, 2026న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. క్రైమ్, న్యాయం, శిక్ష వంటి అంశాలను భావోద్వేగభరితంగా, ఉత్కంఠభరితంగా, విభిన్న కోణాలతో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కథను యష్ కేస్వానీ, సీమా అగర్వాల్, మేఘనా గుల్జార్ కలిసి…

Read more

“రోమాంచకం” పెద్ద హిట్ అవుతుంది – విజయ్ దేవరకొండ

సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు ఈ సినిమా సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు స్టార్…

Read more

ప్రైమ్ వీడియోలో రాబోతున్న మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’

కర్ణాటక సంగీత నేపథ్యంలో సాగే మ్యూజికల్ డ్రామా 'జగమే సంగీతం' అనే వెబ్ సిరీస్‌తో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఓటీటీ ప్రపంచంలోకి అరంగేట్రం చేస్తున్నారు. సుష్మిత కొణిదెల ఈ సిరీస్‌ను నిర్మించారు. సెప్టెంబర్ 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో ‘జగమే సంగీతం’ గురించి దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఎన్నో విశేషాల్ని పంచుకన్నారు. ఈ మేరకు పల్నాటి సూర్య ప్రతాప్ మాట్లాడుతూ .. ‘నా దృష్టిలో కుటుంబం, ఆ కుటుంబాన్ని కలిపి ఉంచే భావోద్వేగాలే ఈ కథకు ప్రధానం. పాత్రల మధ్య సంబంధాలు, సంఘర్షణలు, ఆశయాలు ఆవిష్కృతమయ్యేందుకు సంగీతం ఒక మాధ్యమంగా (భాషగా) పనిచేస్తుంది. నాకు కర్ణాటక సంగీతం అంటే ఎంతో ఇష్టం, దానిపై అవగాహన…

Read more

ఘనంగా గుడ్ టైం చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్

ఎకో క్రాఫ్ట్ మీడియా సమర్పణలో, మూవీ బ్రాట్స్ బ్యానర్ పై రమేష్ జిల్లా నిర్మాతగా, చాణక్య జిల్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గుడ్ టైం. సన్ స్టూడీయోస్, లహరి మ్యూజిక్ ఆధ్యర్యంలో తాజాగా గుడ్ టైం మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రమణారెడ్డి, లక్షమన్ గుంటూరు, వంశీ నందిపాటి, శశికిరణ్ టిక్క, నందు, ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు. యు ఎఫ్ ఓ జోనల్ హెడ్ లక్ష్మణ్ గుంటూరు మాట్లాడుతూ... గుడ్ టైం సినిమాకు ఇక్కడి నుంచి మంచి టైం మొదలవుతుందని, తెలుగు సినిమా పరిశ్రమకు కూడా ఇది గుడ్ టైం అని తెలిపారు. చిన్న సినిమాలు ఈ సమయంలో అద్భుతంగా ఆడుతున్నాయని తెలిపారు…

Read more