Skip to content

‘ది ట్రైటర్స్ తెలుగు’ ప్రీమియర్‌కు ముందు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లో క్లోక్‌మెన్ సందడి

‘ది ట్రైటర్స్ తెలుగు’ వరల్డ్‌వైడ్ ప్రీమియర్‌కు ముందు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నగరాల్లో మిస్టీరియస్ క్లోక్‌మెన్ సందడి చేశారు. ఈ మూడు నగరాల్లోని ప్రముఖ ప్రాంతాల్లో క్లోక్‌మెన్ ప్రత్యక్షమై, షోలోని డిసెప్షన్, ఇన్‌ట్రిగ్ ప్రపంచాన్ని కళ్లముందుకు తీసుకొచ్చారు.

తమ సిగ్నేచర్ క్లోక్స్, మాస్క్స్‌తో కనిపించిన క్లోక్‌మెన్.. నగరంలోని ప్రముఖ ప్రదేశాల్లో సర్‌ప్రైజ్ అప్పియరెన్స్‌లు ఇచ్చారు. దీంతో అక్కడి స్థానికుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ప్రైమ్ వీడియో రాబోయే అన్‌స్క్రిప్టెడ్ ఒరిజినల్‌పై క్యూరియాసిటీని పెంచారు. ‘ది ట్రైటర్స్ తెలుగు’లోని డిసెప్షన్, మైండ్ గేమ్స్, ట్రస్ట్ అనే ప్రధాన అంశాలను ఈ యాక్టివేషన్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ గేమ్‌లో ఎవరైనా ట్రైటర్ కావచ్చు అనే ఆసక్తిని కూడా క్రియేట్ చేశారు.

క్లోక్‌మెన్ అందరి దృష్టిని ఆకర్షిస్తూ క్యూరియాసిటీని పెంచారు. మూడు నగరాల్లో వారి మిస్టీరియస్ ప్రెజెన్స్ గేమ్‌కు, రియాలిటీకి మధ్య ఉన్న లైన్ ను చెరిపేసినట్టుగా అనిపించింది. తెరపై ప్రేక్షకులను ఎదురుచూస్తున్న హై-స్టేక్స్ ప్రపంచానికి ఇది ఒక గ్లింప్స్ ఇచ్చింది.

“మోసం ఇక్కడ న్యూ రూల్” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సిటీ టేకోవర్ ‘ది ట్రైటర్స్ తెలుగు’పై అంచనాలను మరింత పెంచింది. ఇందులో అలయన్స్‌లు ఎప్పుడైనా మారవచ్చు, ట్రస్ట్ ఎప్పుడూ పరీక్షకు గురవుతుంది, ఏ మూల నుంచి అయినా బిట్రేయల్ ఎదురుకావచ్చు.

తేజ సజ్జ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’ను ఎస్ఓఎల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సిరీస్ అక్టోబర్ 15, 2026న ప్రత్యేకంగా ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ తెలుగు భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ కానుంది. ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్‌లు విడుదల కానున్నాయి.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.