Skip to content

హీరో ఆది సాయికుమార్ ప్రొడక్షన్ నెం.3 బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ అనౌన్స్‌మెంట్

ఆది సాయికుమార్ హీరోగా త్రిశూల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ భారీ సినిమా ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. డివైన్ మిస్టరీ, సస్పెన్స్ తో కూడిన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లనుంది. ప్రొడక్షన్ నంబర్ 3గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ జి రుద్రప్ప నిర్మిస్తున్నారు. నవరసన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

దైవిక రహస్యాల నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా.. ఆధ్యాత్మికత, విశ్వాసం, ప్రాచీన నమ్మకాలు, అంతుచిక్కని రహస్యాలతో కూడిన విభిన్నమైన సినీ ప్రపంచాన్ని పరిచయం చేయనుంది. అద్భుతమైన కథనం, బలమైన భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులకు మరపురాని థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందించడమే లక్ష్యంగా చిత్ర బృందం ఈ సినిమాను రూపొందిస్తోంది.

ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ డార్క్, మిస్టరీ వాతావరణంతో పాటు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అతీంద్రియ రహస్యాలతో ముడిపడిన కథను ఈ పోస్టర్ సూచిస్తోంది. పోస్టర్ మధ్యలో త్రిశూలం చుట్టూ చుట్టుకుని, పడగ విప్పిన భారీ నాగుపాము అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది. దాని చుట్టూ కత్తులు, గొడ్డళ్లు, ఈటెలు, అర్ధచంద్రాకారంలో ఉన్న ఆయుధం, గద వంటి ప్రాచీన ఆయుధాలను అమర్చారు. ఇవి పోస్టర్‌కు మరింత గంభీరమైన, భయానకమైన రూపాన్ని అందిస్తున్నాయి.

దట్టమైన చీకటితో నిండిన అడవిలోని పురాతన ఆచారాలు కలిగిన ప్రదేశాన్ని తలపించేలా పోస్టర్‌ను రూపొందించారు. వేలాడుతున్న గంటలు, మెలికలు తిరిగిన చెట్ల కొమ్మలు, వెలుగుతున్న దీపాలు మర్మమైన వాతావరణాన్ని మరింత పెంచుతున్నాయి. పోస్టర్ దిగువన రంగురంగుల పూల మధ్య కనిపించే చిన్న జ్వాల.. ముదురు నీలం, అగ్నిలాంటి ఎరుపు రంగులతో నిండిన విజువల్ ఆసక్తికరంగా వుంది. ఈ సినిమా నెక్స్ట్ అప్‌డేట్‌ను అక్టోబర్ 20, 2026న వెల్లడించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో ఆది సాయికుమార్ భాగం కావడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. భారీ స్థాయిలో, ప్రత్యేకమైన విజువల్ స్టయిల్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దైవిక అంశాలు, ఆసక్తికరమైన రహస్యాలతో కూడిన ఈ సినిమా ఆది సాయికుమార్ కెరీర్‌లో మరో ముఖ్యమైన అధ్యాయంగా నిలవనుంది.

‘కాంతార’, ‘విరూపాక్ష’, ‘మంగళవారం’ వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన భాగస్వామ్యం కావడం సినిమా నేపథ్య సంగీతం, సౌండ్‌స్కేప్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని అప్‌డేట్స్ ను మేకర్స్ రివిల్ చేయనున్నారు.

ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

నటీనటులు: ఆది సాయికుమార్

సాంకేతిక బృందం:

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నవరసన్
నిర్మాత: ప్రశాంత్ జి రుద్రప్ప
నిర్మాణ సంస్థ: త్రిశూల్ ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
పీఆర్వో: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.