Skip to content

56 షోలతో మొదలై సింగిల్ స్క్రీన్స్ కి పండుగ తెచ్చిన ‘ప్రేమనే ఊరిలో’

సినిమాలో దమ్ముంటే.. స్టార్ కాస్టింగ్ గురించి జనాలు పట్టించుకోరు. చిన్న చిత్రమా? పెద్ద చిత్రమా? అన్నది ప్రేక్షకులు చూడటం లేదిప్పుడు. ‘ప్రేమనే ఊరిలో’ (కన్నడలో ‘ప్రేమాద ఊరలి’) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. మొదటి రోజు కేవలం 56 షోలు, 12 లక్షల కలెక్షన్లతో మొదలైన ప్రయాణం.. మూడో ఆదివారానికి ఏకంగా 1600 షోలు, సింగిల్ డేలోనే 13 కోట్లు కొల్లగొట్టే రేంజ్‌కి వెళ్లింది.

చిన్న సినిమాలకు 10 కోట్లు రావడమే గగనమైన ఈ రోజుల్లో కేవలం 3 వారాల్లో 78 కోట్లు సాధించి బాక్సాఫీస్ హిస్టరీని తిరగరాసింది. థియేటర్ల ముందు కుటుంబాలు బారులు తీరుతున్నాయి. జనాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులే దిగాల్సి వస్తోంది. “మా జీవితకాలంలో ఇలాంటి ఉత్సవం చూడలేదు” అని సింగిల్ స్క్రీన్ ఓనర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రముఖ సంస్థల నుంచి భారీ ఆఫర్లు వచ్చినప్పటికీ థియేట్రికల్ రన్ కోసం చిత్ర బృందం ఏ డీల్‌నూ అంగీకరించలేదు. అంతేకాకుండా తాము ఎలాంటి ఓటీటీ ఒప్పందం కూడా కుదుర్చుకోలేదని స్పష్టం చేస్తూ మేకర్స్ అధికారికంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.

అక్టోబర్ 2న తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అద్భుతమైన సమీక్షలు దక్కాయి. కన్నడ మాతృక తరహాలోనే ఇక్కడ కూడా మౌత్ టాక్‌తోనే లాంగ్ రన్‌లో ఈ చిత్రం సూపర్‌హిట్ దిశగా వెళ్తోంది. ఈరోజుల్లో ఓటీటీ డీల్స్ కోసమే సినిమాలు తీస్తున్నారు. అలాంటిది కేవలం థియేట్రికల్ రన్ కోసం భారీ ఓటీటీ డీల్స్ వదులుకుని ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.