Skip to content

ఐఎఫ్‌ఎఫ్‌డి 2026లో ‘భగవంత్ కేసరి’ ప్రదర్శన

అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌డి) 2026లో భాగంగా తెలుగు సినీ దిగ్గజం, లెజెండరీ నటుడు నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఐదు దశాబ్దాల అసాధారణ సినీ వారసత్వాన్ని, చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తుగా ప్రతిష్టాత్మకమైన భరత్ మండపంలో జరిగిన అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌డి) 2026లో తెలుగు సినిమా దిగ్గజం నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. 50 ఏళ్ల ప్రస్థానంలో భారతీయ సినిమాకు ఆయన చేసిన అపారమైన సేవకు గుర్తింపుగా, నటన కళ పట్ల ఆయనకున్న చెరగని ప్రభావం, బహుముఖ ప్రజ్ఞ, అసమానమైన అంకితభావానికి నివాళిగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మార్చి 25న న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు…

Read more

రవి తేజ ‘ఇరుముడి’ షూటింగ్ 50 శాతం పూర్తి

మాస్ మహారాజా రవి తేజ ప్రస్తుతం తన ‘ఇరుముడి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రతిష్టాత్మక పాన్-ఇండియన్ పవర్‌హౌస్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ భారీ ఎత్తున నిర్మిస్తోంది. మేకర్స్ ఇప్పటికే రవి తేజ, ప్రియా భవానీ శంకర్‌ల ఫస్ట్ లుక్‌ను పోస్టర్‌ను విడుదల చేసి అందరిలోనూ క్యూరియాసిటీని పెంచేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోండగా ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం చిత్ర బృందం హైదరాబాద్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తోంది. అనల్ అరసు, రియల్ సతీష్ స్టంట్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో చూడనటువంటి అత్యంత అద్భుతమైన ఫైట్‌లను ప్రేక్షకులు చూడబోతున్నారని…

Read more

నా సినిమాలకు డబ్బులు కూడా వస్తాయని ‘పాపం ప్రతాప్’ నిరూపిస్తుంది: తిరువీర్

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ ప్రధాన పాత్రలో, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన వైవిధ్యభరిత చిత్రం ‘పాపం ప్రతాప్’. కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్‌ రెడ్డి గడ్డం, రుద్రదేవ్‌ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్న ఈటీవి విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్‌‌ నుంచి రాబోతున్న ఈ సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజైన టీజర్‌కు మంచి అప్లాజ్ వస్తోంది. ఇప్పటివరకు ప్రేమలో గెలిచాం.. పెళ్లి తర్వాత ఆ ప్రేమ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్న ఓ జంట చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందింది. ‘రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవైనా జరిగినా.. ఆ గొడవ వల్ల నా పరువు పోయినా.. గుర్తుపెట్టుకో నీ బతుకు నా…

Read more

బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం

అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌డి) 2026లో భాగంగా తెలుగు సినీ దిగ్గజం, లెజెండరీ నటుడు నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఐదు దశాబ్దాల అసాధారణ సినీ వారసత్వాన్ని, చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తుగా ప్రతిష్టాత్మకమైన భరత్ మండపంలో జరిగిన అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌డి) 2026లో తెలుగు సినిమా దిగ్గజం నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. 50 ఏళ్ల ప్రస్థానంలో భారతీయ సినిమాకు ఆయన చేసిన అపారమైన సేవకు గుర్తింపుగా, నటన కళ పట్ల ఆయనకున్న చెరగని ప్రభావం, బహుముఖ ప్రజ్ఞ, అసమానమైన అంకితభావానికి నివాళిగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మార్చి 25న న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు…

Read more

‘నాగబంధం’ జూలై 3న గ్రాండ్ రిలీజ్

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మైథలాజికల్ ఎపిక్ చిత్రం ‘నాగబంధం’. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూలై 3న విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. వర్షాకాలం ప్రారంభంలోనే విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. ఈ మేరకు విడుదల తేదీ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రెండు రకాల గెటప్స్‌లో హీరో కనిపిస్తున్నారు. పై భాగంలో శివుడిగా హీరోగా పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక కింది భాగంలో మోడ్రన్ లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ రెండు లుక్స్‌తో డిజైన్ చేసిన పోస్టర్ ఆడియెన్స్‌‌లో మరింత…

Read more

మధ్యతరగతి కుటుంబ కథే ‘కార్మేని సెల్వం’

పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. గురువారం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుత ట్రెండ్‌కు కనెక్ట్ అయ్యే విధంగా…

Read more

రేసుగుర్రం ఏప్రిల్ 8న గ్రాండ్‌గా రీ-రిలీజ్

టాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించిన రేసుగుర్రం సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రీ-రిలీజ్ ట్రైలర్ విడుదల అయ్యింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా యాక్షన్, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ కలయికతో అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ చిత్రానికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ట్రైలర్‌తో మళ్లీ ఆ పాత మాస్ ఫీల్‌ను ప్రేక్షకులు అనుభవించబోతున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా, బ్రహ్మానందం తన కామెడీతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్రౌన్ మూవీస్ ద్వారా ఏప్రిల్ 8, 2026న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా, బన్నీ ఫ్యాన్స్‌కు బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను మరింత గ్రాండ్‌గా మార్చనుంది…

Read more

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హర్షం

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఢిల్లీ 2026 లో శ్రీ నందమూరి బాలకృష్ణ గార్కి “లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు” (జీవన సాఫల్య పురస్కారం) లభించడం, ఆ పురస్కారాన్ని ఢిల్లీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీమతి గుప్తా రేఖ గారి చేతుల మీదుగా వారు అందుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ప్రస్థానంలో ఇది మరొక మైలురాయి మాత్రమే కాదు, తెలుగు సినీ పరిశ్రమకే ఇది గర్వకారణం. ఈ సందర్భంగా, శ్రీ నందమూరి బాలకృష్ణ గార్కి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరిన్ని అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. ఇట్లు భవదీయులు (టి. ప్రసన్న కుమార్) (వై.వి.స్. చౌదరి)…

Read more

‘పెద్ది’ మాస్ ర్యాంపేజ్ ‘గేమ్’ గ్లింప్స్ మార్చి 27న రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  పాన్-ఇండియా యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. పెద్ది ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సంచలనం క్రియేట్ చేస్తోంది. పెద్ది ఫస్ట్ షాట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఎఆర్ రెహమాన్ అందించిన సౌండ్‌ట్రాక్స్ మెగా చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. చికిరి చికిరి,  రైరై రా రా పాటలు వరల్డ్ వైడ్ వైరల్ అయ్యాయి. తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. 'పెద్ది' గేమ్ గ్లింప్స్ మార్చి 27 ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ కానుంది…

Read more

‘రాకాస’ ఏప్రిల్ 3న రిలీజ్

నిహారిక.. జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిర్మించిన చిత్రం ‘రాకాస’. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన టీజ‌ర్‌, సాంగ్స్‌తో సినిమాపై ఆస‌క్తి పెరిగింది. డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో మూవీపై బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ బుధ‌వారం రోజున ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. లేటెస్ట్‌గా విడుద‌లైన ఈ ట్రైల‌ర్ సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మ‌రింత‌గా పెంచాయి. ‘ఆ కోట‌లో ఉన్న‌ది.. ఊరు బ‌లి పంపుతున్న‌ది సామాన్యుడికి కాదు.. భీక‌ర బ్ర‌హ్మ రాక్ష‌సుడికి’ అనే డైలాగ్‌తో ‘రాకాస‌’ ట్రైల‌ర్…

Read more