లిటిల్ మిస్ & మిస్టర్ సౌత్ ఇండియా బ్యూటీ పేజంట్ కర్టెన్ రైజర్
హైదరాబాద్, డిసెంబర్: దక్షిణ భారతదేశంలో బాల, బాలికల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఉన్న లిటిల్ మిస్ & మిస్టర్ సౌత్ ఇండియా బ్యూటీ పేజంట్‌కు సంబంధించిన కర్టెన్ రైజర్, హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రాండ్ ఫినాలే తేదీ మరియు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ది లుక్స్ – మోడలింగ్ & యాక్టింగ్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పేజంట్, పిల్లల్లో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, స్టేజ్ ప్రెజెన్స్‌ను పెంపొందించడం ప్రధాన ఉద్దేశ్యం. ఈ పోటీల్లో హైదరాబాద్‌తో పాటు విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి నగరాల నుంచి పాల్గొననున్నారు. ఫైనల్ డిసెంబర్ 27న యూసుఫ్‌గూడ పోలిస్ లైన్స్‌లోని శౌర్య కన్వెన్షన్ హాల్‌లో జరగనుంది. కార్యక్రమానికి…
