Skip to content

నవీన్ చంద్ర ‘NC 51’ షూటింగ్ పూర్తి

నటుడు నవీన్ చంద్ర హీరోగా, దర్శకుడు ఆర్.పి. బాల తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘NC 51’ షూటింగ్ పూర్తయింది. ఆర్.పి. బాల ఫిల్మ్స్, పి.జి. ముత్తయ్య ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్.పి. బాల, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.జి. ముత్తయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఎలెవన్’ చిత్రంలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర కథల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయన కెరీర్‌లో 51వ చిత్రంగా రూపొందుతున్న ‘NC 51’ కొత్త కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. చెన్నైలో అక్టోబర్ 26, సోమవారం నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. చిత్రబృందం షూటింగ్ విజయవంతంగా పూర్తవడంతో ఆనందం వ్యక్తం చేస్తూ వేడుక చేసుకుంది. ఈ చిత్రంలో హరిప్రియ రోషిణి, బాల…

Read more

ఘనంగా ప్రారంభమైన ‘ఓరి నాయనో’ చిత్రం

▪️*ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి.. తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించిన డా. అనిల్ విశ్వనాథ్* తెలుగు ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన చిత్రాన్ని అందించేందుకు ‘ఓరి నాయనో’ సిద్ధమవుతోంది. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్. సాయి అభిషేక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణి తేజ గొంది దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ శుభముహూర్తంలో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి ముహూర్తపు షాట్‌కు తొలి క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించగా, ‘పొలిమేర’ ఫ్రాంచైజీ చిత్రాలతో గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ, చిత్ర బృందానికి…

Read more

రిషబ్ శెట్టి టైటిల్‌ రోల్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం

2027 ఆరంభంలో ఈ ప్రతిష్టాత్మక గాథ సెట్స్ పైకి వెళ్లనున్న నేపథ్యంలో, నిర్మాత భూషణ్ కుమార్ ఆ దిగ్గజ మరాఠా రాజు యొక్క వందేళ్ల నాటి చిత్రపటాన్ని రిషబ్ శెట్టికి బహూకరించి గౌరవించారు. భారతదేశపు అత్యంత గౌరవనీయ చారిత్రక మహనీయులలో ఒకరైన ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క అసాధారణ జీవితం, వారసత్వం మరియు దార్శనికతను కీర్తించే ప్రతిష్టాత్మక రెండు భాగాల చారిత్రక గాథ అయిన ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్ – ఛత్రపతి శివాజీ మహారాజ్’ చిత్రం కోసం టి-సిరీస్ సంస్థ చేతులు కలిపింది. ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు ఆయన స్వరాజ్య దార్శనికతను ఒక బృహత్తర చలనచిత్ర రూపంలో ఆవిష్కరించడానికి భూషణ్ కుమార్, సందీప్ సింగ్ మరియు రిషబ్…

Read more

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను – వి. విజయేంద్ర ప్రసాద్

వెన్నెల సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద దీపక్ నిర్మాణంలో శరత్ తెరకెక్కించిన చిత్రం ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’. ఈ సినిమాలో రజత్ రాఘవ్, కాజల్, హాసిని సుధీర్ హీరో హీరోయిన్లు గా బేబీ పరిణిత రుద్రరాజు ముఖ్య పాత్రలో రూపొందించిన ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను గురువారం నాడు రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంచ్‌కి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. స్టార్ డైరెక్టర్ వి. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘పరిణితతో సినిమాని తీసేందుకే దర్శకుడు, నిర్మాత పుట్టారనిపిస్తోంది. పరిణితకు ఈ తెలుగు సినిమా చరిత్రలో ఓ పేజీ ఉండబోతోంది. శరత్ గారు సినిమాని అద్భుతంగా తీసి ఉంటారని ఆశిస్తున్నాను. రజత్‌కి ఈ చిత్రంతో…

Read more

‘ఆకాశంలో ఒక తార’ ఫస్ట్ సింగిల్ ‘రాధే రాధే’ రిలీజ్

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, పోస్టర్లతో ఆసక్తిని పెంచిన మేకర్స్.. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ ఫస్ట్ సింగిల్ ‘రాధే రాధే’ను విడుదల చేశారు. సాధారణంగా గుజరాత్‌కు వెళ్లడానికి రెండు ప్రధాన కారణాలు ఉంటాయి. ఒకటి ద్వారకను సందర్శించడం, రెండోది బొగ్గు గనుల్లో పనిచేయడం. దుల్కర్ సల్మాన్, బిజిలీ పాత్రలో నటిస్తున్న రుహాని శర్మ…

Read more

‘రామాయణం’ నుంచి మరో అందమైన ‘జతగూడె’ పాట రిలీజ్

నమిత్ మల్హోత్రా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ నుంచి మరో అందమైన పాట ‘జతగూడె’ విడుదలైంది. శ్రీరాముడు, సీతమ్మ కళ్యాణం అద్భుతమైన విజువల్స్‌తో ఆవిష్కరిస్తూ, వారి కళ్యాణంలోని మధురమైన క్షణాలను ఈ పాటలో చూపించారు. ఈ పాటకు ఏ.ఆర్. రెహమాన్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. రాకేందు మౌళి తెలుగు సాహిత్యాన్ని అందించారు. శిరీష భాగవతుల మనసు ఆకట్టుకునేలా ఆలాపించారు. శ్రీరాముడు, సీతమ్మ వివాహ వేడుకలకు సంబంధించిన దృశ్యాలు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పవిత్రమైన వివాహ వేడుకలు, అయోధ్యను దాటి సాగిన ప్రయాణం.. ఇలా శ్రీరాముడు, సీతమ్మ జీవితంలోని వివిధ ఘట్టాలను ఈ పాటలో చూపించారు. ఈ పాట ప్రతి ఒక్కరీ ఆకట్టుకుంటుంది. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతమ్మగా సాయిపల్లవి నటిస్తున్న ఈ…

Read more

‘డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమాగా నిలుస్తుంది – శేఖర్ కమ్ముల

యువన్‌కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్, మనస్విని భాగ్యరాజ సమర్పణలో కార్తీక్ భాగ్యరాజ రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. ఈ చిత్రంలో సౌమిత్, శ్రేయసి సేన్, కమల్ కామరాజు, గీతా భాస్కర్, చైత్ర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని నవంబర్ 20న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో గురువారం నాడు సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ .. ‘‘ఆస్ట్రోనాట్ అవ్వాలనే కోరిక ఉండటం, ఆ కోరిక చుట్టూ కథను తీయడం బాగుంది. ఈ అమ్మాయి కూడా చక్కగా నటించింది. ఇది చాలా మంచి ప్రయోగం. ఎవరైనా సరే ఎంత…

Read more

చిరంజీవి ‘చిరంజీవీస్ మెగావర్స్’తో నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ

దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో భారతీయ సినిమా ప్రేక్షకులని అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో కొత్త శకంలోకి అడుగుపెడుతున్నారు. ‘చిరంజీవీస్ మెగావర్స్’తో నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. భారతీయ సినిమాలో అత్యంత అభిమానాన్ని సంపాదించుకున్న దిగ్గజాల్లో ఒకరైన చిరంజీవి, ప్రపంచంలోనే ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌తో చేతులు కలపడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆసక్తికరమైన సంభాషణలు, ఆకట్టుకునే కథలు, చిరంజీవి చరిష్మా, చమత్కారం, తరతరాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ఈ షో సాగనుంది. ఇది ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానానికి మరో ప్రత్యేకమైన కోణాన్ని జోడించనుంది. తరతరాల ప్రేక్షకులతో విడదీయలేని అనుబంధం కలిగిన మెగాస్టార్ చిరంజీవి తన ఆప్యాయత, స్పాంటినిటీ, ఆకట్టుకునే వ్యక్తిత్వంతో ఈ కొత్త వేదికపై కనిపించనున్నారు. దీంతో ప్రేక్షకులు…

Read more

సింగర్ ఎం.ఎం. శ్రీలేఖ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్రం నుండి ‘జినక్ చిక’ పాట విడుదల

రమేష్ జక్కల దర్శకత్వంలో ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మాతగా ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం యద్భావం తద్భవతి. వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇనయ సుల్తానా, రేణు శ్రీ హీరోయిన్స్ గా నటిస్తుండగా సుమన్, నాగ మహేష్, లోహిత్ కుమార్, ధనరాజ్, శ్వేత వర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి మిహిరామ్ సంగీతం అందించగా ఈ చిత్ర పాటలను కే మ్యూజిక్ ద్వారా చిత్ర దండం విడుదల చేస్తుంది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం నుండి 'జినక్ చిక' అంటూ సాగే పాటను ప్రముఖ సింగర్ ఎం.ఎం. శ్రీలేఖ గారి చేతుల…

Read more

“కల్ట్ “ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది – విశ్వక్ సేన్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, తారక్ సినిమాస్ గ్లోబల్ స్లాషర్ ఫిల్మ్ ‘కల్ట్’ రిలీజ్ ట్రైలర్ లాంచ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్ట్’తో ప్రేక్షకులను టెర్రిఫిక్ వరల్డ్ లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తూ, ప్రధాన పాత్రలోనూ నటిస్తున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కకరాల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని, వాస్తవ జీవితంలోని కలవరపరిచే ఘటనల స్ఫూర్తితో రూపొందించిన ఇండియాలోనే తొలి ఒరిజినల్ స్లాషర్ థ్రిల్లర్‌. సినిమా విడుదలకు ఒక రోజు ముందు మేకర్స్ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. మొదటి ట్రైలర్‌లో సినిమా నేపథ్యాన్ని పరిచయం చేస్తూ, ఓ పార్టీలో…

Read more