Skip to content

‘బకైతి’ సీజన్ 2 జీ5లో సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్

ప్రధాన పాత్రల్లో రాజేశ్ తైలాంగ్, షీబా చద్దా, తన్యా శర్మ, ఆదిత్య శుక్ల ప్రేక్ష‌కుల‌ను మ‌రోసారి న‌వ్వించ‌టానికి సిద్ధ‌మైన కటారియా ఫ్యామిలీ..ఈసారి మరింత ప్రేమ, నవ్వులు, గొడవలు, రోజువారీ జీవితంలోని సరదా గందరగోళంతో సంద‌డి చేయనున్న‌ క‌టారి కుటుంబం ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో తిరుగులేని ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న జీ5 తాజాగా అందరికీ నచ్చిన ‘బకైతి’ సీజన్ 2తో సంద‌డి చేయనుంది. లేటెస్ట్‌గా ఈ కొత్త సీజ‌న్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్ సెప్టెంబర్ 25 నుంచి జీ5లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబ జీవితం, వారి రోజువారీ సమస్యలు, సరదా సంఘటనలను సహజంగా చూపించిన ‘బకైతి’ తొలి సీజన్‌కు ప్రేక్షకుల నుంచి…

Read more

‘పిక్ నిక్ ’ ఫస్ట్ లుక్ రిలీజ్

‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’తో భారీ గ్లోబల్ సక్సెస్‌ను అందుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ భావన స్టూడియోస్ తమ కొత్త సినిమాను ప్రకటించింది. ‘పిక్ నిక్ ’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సందీప్ ప్రదీప్, ఇంద్రజిత్ సుకుమారన్, దిలీష్ పోతన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా 2027 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ‘ప్రేమలు’, ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ విజయాల తర్వాత భవానా స్టూడియోస్ నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సౌత్ ఇండియాలో మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమాతో రచయిత కిరణ్ జోసీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సెన్సేషనల్ హిట్స్ ‘ప్రేమలు’, ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ చిత్రాలకు…

Read more

‘ది ప్యారడైజ్’ లాంటి ఇంటెన్సిటీ, వరల్డ్ బిల్డింగ్, ఎమోషన్స్ ఉన్న సినిమా ఇప్పటివరకు రాలేదు: నాని

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బెంగళూరు లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో న్యాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. బెంగళూరు ఎప్పుడు వచ్చినా సరే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ ప్రేక్షకులు ఎంతగానో ప్రేమ, ఆదరణ చూపిస్తారు. ప్రేక్షకుల ప్రేమ, ఆదరణకు నేను ఎప్పుడూ కృతజ్ఞతలు ఉంటాను. ‘ప్యారడైజ్’ నా కెరీర్‌లో చాలా…

Read more

గరుడ సేవ కోసం తిరుమల చేరిన చెన్నై గొడుగులు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడసేవ కోసం చెన్నై నుండి గొడుగులు తిరుమలకు చేరుకున్నాయి. హిందూ ధర్మార్థ సమితి తరఫున 9 గొడుగులు, విశ్వహిందూ పరిషత్ తరపున 11 గొడుగులు సమర్పించారు. రేపు సాయంత్రం జరిగే గరుడవాహన సేవకు ఈ గొడుగులను అలంకరించనున్నారు. విశ్వహిందూ పరిషత్ శతాబ్దాలుగా గొడుగులు అందిస్తుండగా, హిందూ ధర్మార్థ సమితి గడిచిన 21 సంవత్సరాలుగా చెన్నై నుండి‌ పాదయాత్రగా గొడుగులను తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర , అదనపు ఈవో శ్రీ చ వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, చీఫ్ విజిలెన్స్ & సెక్యూరిటీ ఆఫీసర్ కెవి మురళి కృష్ణ, అలాగే ఎస్వీబీసీ చైర్మన్…

Read more

‘జాంబీ రెడ్డి 2 NXT LVL’ నుంచి ఉపేంద్ర మునుపెన్నడూ చూడని ఫస్ట్ లుక్ రిలీజ్

'హనుమాన్', 'మిరాయ్' చిత్రాలతో పాన్-ఇండియా విజయం సాధించిన సూపర్ హీరో తేజ సజ్జ, ప్రస్తుతం 'జాంబీ రెడ్డి 2 NXT LVL' గా వస్తున్న 'జోంబీ రెడ్డి' సెకెండ్ పార్ట్ లో నటిస్తున్నారు. 'జాంబీ రెడ్డి' క్రియేటర్ ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌కు క్రియేటర్ గా, సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకుడిగా చేస్తున్నారు. ‘హక్’, ‘రానా నాయుడు’, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి ప్రశంసలు అందుకున్న ప్రాజెక్ట్స్‌తో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లకు రచయితగా పనిచేసిన సుపర్ణ్ ఎస్. వర్మ.. ఈ ఫ్రాంచైజ్‌కు తనదైన ఇంటెన్స్ టచ్‌ను తీసుకొస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తేజ సజ్జా, పీపుల్…

Read more

25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతోన్న జీ5 ఒరిజినల్ సిరీస్ ‘పంచనామా’

జీ5 గత వారం ‘పంచనామా’ అన ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కి నిర్మాత, షో రన్నర్‌గా ఉదయభాను వ్యవహరించారు. ఆరు ఎపిసోడ్స్‌‌తో వచ్చిన ఈ మొదటి సీజన్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఆరు ఎపిసోడ్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ఆడియెన్స్‌ ఈ సిరీస్‌ను ఎక్కువగా వీక్షిస్తున్నారు. వరుసగా మూడు హత్యలు జరగడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఒక్క క్లూ కూడా దొరక్కపోవడం, చివరకు ఈ హత్యల వెనుకున్న కారణాన్ని తెలుసుకోవడం.. వంటి ఆసక్తికరమైన అంశాలతో ‘పంచనామా’ సిరీస్…

Read more

‘ప్రేమనే ఊరిలో’ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను – కామాక్షి భాస్కర్ల

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక శనివారం నాడు మరో పాటను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్‌లో కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ అనే టైటిలే చాలా బాగుంది. టీజర్‌లో శ్రీకాంత్ గారి…

Read more

ఈ నెల 21న “రణబాలి” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఏందయ్యా సామీ..’ రిలీజ్

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "రణబాలి" మూవీ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా "రణబాలి" సినిమా రూపొందుతోంది. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా "రణబాలి" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది…

Read more

ఎస్వీబీసీ అధికారులతో టీటీడీ ఛైర్మన్ సమావేశం

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) ఆర్థిక స్వయం సమృద్ధి సాధించే దిశగా ఉద్యోగులు కృషి చేయాలని టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు సూచించారు. తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీటీడీ పాలకమండలి సభ్యులు, ఎస్వీబీసీ ఛైర్మన్ బి. శ్రీధర్ వర్మ, టీటీడీ జేఈఓ, ఎస్వీబీసీ సీఈఓ డాక్టర్ ఏ. శరత్‌తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు మాట్లాడుతూ... "ఛానెల్ నిబంధనలకు అనుగుణంగా మరిన్ని ప్రకటనలు తీసుకురావడం ద్వారా ఆదాయాన్ని పెంచాలి, ఇందుకోసం మార్కెటింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలి" అని సూచించారు. ఈ సందర్భంగా ఛానెల్ ద్వారా నిర్వహిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు, ఇతర కార్యక్రమాలు, కొత్తగా చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను…

Read more

‘ది ప్యారడైజ్’ అందరికీ కనెక్ట్ అవుతుంది: చెన్నై ప్రెస్ మీట్‌లో నాని

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. చెన్నై ప్రెస్ మీట్‌లో న్యాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘ది ప్యారడైజ్ 24న రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు థియేటర్ లో మంచి మాస్ ఫిలిమ్‌ని చూడాలనుకుంటారు. అలాంటి గొప్ప మాస్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ‘ప్యారడైజ్’. ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో…

Read more