ప్రారంభమైన క్యాప్ స్టన్ హోమ్ సర్వీసెస్ యాప్ బ్రాండ్ అంబాసిడర్ గా అక్కినేని నాగార్జున
దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరణ లక్ష్యం రెండు దశాబ్దాలకు పైగా B2B సేవల రంగంలో విశ్వసనీయమైన మానవ వనరుల పరిష్కారాలను అందిస్తున్న కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్, తన అనుబంధ సంస్థ కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా హైదరాబాద్లో కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ యాప్ను ప్రారంభించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్లైన్ హోమ్ సర్వీసెస్ టెక్నాలజీ మార్కెట్లోకి ఈ యాప్ ద్వారా సంస్థ అధికారికంగా అడుగుపెట్టింది. ఈ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. ఈ కార్యక్రమంలో కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ డా. సి.ఆర్. నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ…
