Skip to content

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు- ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఆంధ్రప్రదేశ్ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ యూనియన్లు చేసే వసూళ్ళ కార్యకలాపాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని దర్శకుడు సముద్ర స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం హౌసింగ్ సొసైటీకి ఎలాంటి స్థలాన్ని కేటాయించలేదని ఆయన తెలిపారు. ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ఏపీ ప్రభుత్వం స్థలాలు ఇచ్చారని, డబ్బులు తీసుకుంటున్నారని కొందరు మిత్రులు తనకు ఫోనులు చేసి ఎంక్వయిరీ చేయడం వల్ల అందరికీ వివరణ ఇవ్వటం కోసం ఈ ప్రకటన ఇస్తున్నానని సముద్ర తెలిపారు. కొత్తగా ఏర్పాటైన ఏపీ ఎఫ్.డి.సి కమిటీ చాలా అద్భుతంగా ఉందని, చిత్రసీమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఏపీ ప్రభుత్వం లేదా ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ పేరుతో కొందరు వ్యక్తులు డబ్బులు…

Read more

కృష్ణారెడ్డి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం : “స్పిరిట్ ఇస్ నాట్ వన్”… నిర్మాత నర్సమ్మ

"స్పిరిట్ ఇస్ నాట్ వన్" సినిమాపై కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలను చిత్ర యూనిట్ తీవ్రంగా ఖండించింది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, వాస్తవాలకు విరుద్ధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని చిత్ర బృందం పేర్కొంది. సినిమా నిర్మాణం, టైటిల్ మార్పు, బ్యానర్ మార్పు వంటి అంశాలన్నీ చట్టబద్ధంగా, సంబంధిత విధానాల ప్రకారమే జరిగాయని యూనిట్ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టులో తన పాత్ర గురించి కృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. వ్యక్తిగత కారణాలు, ఆర్థిక లావాదేవీలు లేదా కుటుంబ విషయాలను సినిమాతో ముడిపెట్టి చిత్ర యూనిట్‌పై నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమని తెలిపింది. సినిమా విడుదలకు ముందు ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం వెనుక ఉద్దేశాలు…

Read more

శివాజీ బర్త్ డే స్పెషల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతోన్న విలక్షణ నటుడు

తెలుగు సినిమా లోకానికి, తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు శివాజీ. నటుడిగా, హీరోగా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. ఎంతో మంది కుర్ర హీరోలకు తన గాత్రాన్ని ఇచ్చి నిలబెట్టారు. శివాజీ తన కెరీర్‌లో డబ్బింగ్ చెప్పింది కొంత మందికే అయినా అందులో ఆయన మార్క్ ఎప్పటికీ ప్రేక్షకుల్లో నిలిచే ఉంటుంది. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ, యాక్షన్ ఇలా అన్ని రకాల కథలతో ఆడియెన్స్‌ని ఆయన ఆకట్టుకున్నారు. అయితే సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన బిగ్ బాస్ షోతో మళ్లీ కెరీర్‌ను ప్రారంభించారు. బిగ్ బాస్ షోతో శివాజీ ప్రతీ ఇంటి గడపలోకి, తెలుగు వారి మనసుల్లో మళ్లీ స్థానాన్ని సంపాదించుకున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు…

Read more

ఆస‌క్తిని పెంచుతోన్న ‘వీరభద్రుని రహస్యం’.. .జూలై 3 నుంచి జీ5లో స్ట్రీమింగ్

ఇండియాలో టాప్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌గా ప్రేక్ష‌కుల‌ను డిఫ‌రెంట్ కంటెంట్‌తో అల‌రిస్తోన్న జీ5 ఇప్పుడు మ‌రో వైవిధ్య‌మైన సిరీస్ ‘వీర‌భ‌ద్రుని ర‌హ‌స్యం’తో ప్రేక్ష‌కుల మెప్పించ‌నుంది. వీర‌భ్ర‌ద‌పురం.. అంద‌మైన ప‌ల్లెటూరు.. అయితే ఆ ఊరు వెనుక తెలియ‌ని ఓ ర‌హ‌స్యం ఉంది..అదే వీర‌భద్రుడు. ఊరిని కాపాడే వీర‌భ‌ద్రుడు నుంచి త‌ప్పు చేయాల‌నుకున్న‌వారు త‌ప్పించుకోలేరు.. ఊళ్లోని ధ‌ర్మ గంట మోగిందంటే.. త‌ప్పు చేసిన వాళ్లు అంతం కాక త‌ప్ప‌దు. దీంతో ఊళ్లోని ప్ర‌జ‌లు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెలుగుతుంటారు. అలాంటి ఊర్లోకి వెన్నెల అనే అమ్మాయి (అనీ) వ‌స్తుంది. త‌ను ఊళ్లో వీర‌భ‌ద్రుడు చేసే ప‌నుల‌ను గ‌మ‌నిస్తుంది. త‌నేం చేస్తుంది.. నిజంగానే వీర‌భ‌ద్ర‌పురంలో వీర‌భ‌ద్రుడు ఉన్నాడా? త‌ప్పు చేసిన‌వాడిని శిక్షిస్తున్నాడా? ఇంత‌కీ వీర‌భ‌ద్ర‌పురంలోని ఆ ర‌హస్యం ఏంట‌నేది తెలుసుకోవాలంటే వీర‌భ‌ద్రుని…

Read more

రామ్ పోతినేని హీరో, దర్శకుడిగా #RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం #RAPO23 అధికారికంగా లాంచ్ చేశారు. ఎన్నో ఏళ్ల పాషన్, ప్లానింగ్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంతో రామ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ చిత్రం ఈరోజు సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. నిర్మాత కృష్ణ పోతినేని స్క్రిప్ట్ ను రామ్ పోతినేనికి అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి పి. మురళీ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, పి.వి. రవి కిషోర్ క్లాప్ కొట్టారు. దర్శకుడిగా తన ప్రయాణానికి శ్రీకారం చుడుతూ తొలి షాట్‌కు రామ్…

Read more

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'ఇరుముడి'. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్‌కు తొలి పాట ఇరుముడి కట్టుతో అద్భుతంగా శ్రీకారం చుట్టింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కు లభించిన అద్భుత స్పందన, సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ అద్భుతమైన ఫామ్ తో ఈ పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 'ఇరుముడి కట్టు' ఒక ఆధ్యాత్మిక భావోద్వేగాలతో కూడిన భక్తి పాట. జి.వి. ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ పాటలో అయ్యప్ప స్వామి భక్తి, నియమ నిష్ఠలు, మండల దీక్ష పవిత్రతను అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ స్వరకల్పన పాట ప్రారంభం నుంచి ముగింపు వరకు అద్భుతమైన…

Read more

‘ENE Repeat’ నవంబర్ 19న గ్రాండ్ రిలీజ్

యూత్ లో చెరగని ముద్ర వేసుకున్న 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ఇప్పుడు సీక్వెల్ 'ENE Repeat'తో సిద్ధమవుతోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ఆ మ్యాజిక్‌ను మళ్లీ క్రియేట్ చేయడానికి రీయూనియన్ అవుతుండగా, శ్రీనాథ్ మాగంటి ఈ టీంకు కొత్త ఉత్సాహాన్ని జోడిస్తున్నారు. తరుణ్ భాస్కర్ మరోసారి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్త నవంబర్ 19ని విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. చిత్రం (మొదటి భాగం) విడుదలై ఎనిమిది ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆనాటి 'కన్యా రాశి' గ్యాంగ్ జ్ఞాపకాలను గుర్తు చేసేలా, అందరినీ ఆకట్టుకునే ఫ్రెండ్షిప్…

Read more

సూర్య, ‘జై భీమ్’ దర్శకుడు టి.జే. జ్ఞానవేల్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మక చిత్రాన్ని అనౌన్స్ చేసిన హోంబలే ఫిల్మ్స్

భారతీయ సినీ పరిశ్రమలో వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న హోంబలే ఫిల్మ్స్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. విజయ్ కిరగందూర్ నిర్మాణంలో హీరో సూర్య, నటి కాయదు లోహర్, ప్రముఖ దర్శకుడు టి.జే. జ్ఞానవేల్ కాంబినేషన్‌లో ఈ భారీ చిత్రం రూపొందనుంది. పవర్ ఫుల్ కథను అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరు. రెండు జాతీయ పురస్కారాలు, ఏడు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు అందుకున్న ఆయన, కమర్షియల్ విజయాలతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఎన్నో చిత్రాల్లో నటించారు. నిర్మాతగా…

Read more

‘నాగబంధం’లో ఇప్పటివరకూ చేయని స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: హీరోయిన్ నభా నటేష్

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. నాగబంధంలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది? -ఇప్పటివరకు ఇలాంటి పాత్ర నేను చేయలేదు. ఇందులో నేను…

Read more

నా జీవితం ఒక తెల్లకాగితం ఎక్కడా ఒక మచ్చ కూడా పడనివ్వను- మురళీమోహన్‌

ఆ నలుగురి వల్లే నేను ఇంత అభివృద్ధి అయ్యాను మాగంటి మురళీ మోహన్‌ ... తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరు తెలియని వారుండరు. ఆయన అసలు పేరు రాజాబాబు. కానీ మురళీ మోహన్ గానే  ప్రేక్షకులకు పరిచయం..ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఆయన తనదైన ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సందేశాత్మక చిత్రాలను అందించారు. 'జగమే మాయ' చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మురళీ మోహన్, క్రమశిక్షణ గల నటుడిగా పేరు తెచ్చుకుని 350కి పైగా సినిమాల్లో నటించారు. చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.. హీరోగా ,సహాయ నటుడిగా రాణించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు…

Read more