‘రావు బహదూర్’ ఒక సర్రియల్ సినిమా… ఇండియన్ సినిమా ఇలాంటి చిత్రాన్ని ఇప్పటివరకు చూడలేదు: డైరెక్టర్ సుకుమార్
సత్యదేవ్, వెంకటేష్ మహా కాంబినేషన్‌లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ డ్రామా 'రావు బహదూర్'పై రోజురోజుకీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన ప్రెజెంటర్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించగా, తాజాగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కూడా స్పెషల్ ప్రివ్యూ చూసి సినిమాపై ప్రశంసలు కురిపించారు. జూలై 3న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి. సుకుమార్ మాట్లాడుతూ.."రావు బహదూర్ ఒక సర్రియల్ సినిమా. భారతీయ సినీ పరిశ్రమలో ఇలాంటి సినిమా ఇప్పటివరకు వచ్చిందని నేను అనుకోవడం లేదు. ఇది ఒక మ్యాజికల్, ఇమర్సివ్ సినీ అనుభూతిని అందించే చిత్రం. ప్రేక్షకులను ప్రతి క్షణం ఆశ్చర్యపరుస్తుంది" సత్యదేవ్ నటన గురించి…
