Skip to content

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో మరో భారీ చిత్రం.. దైవిక నేపథ్యంతో అద్భుత దృశ్య కావ్యం!

విజయాలు సాధించే చిత్రాలు ఎన్నో వస్తుంటాయి. కానీ, చరిత్ర సృష్టించి, చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన అద్భుతానికి శ్రీకారం చుట్టారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటైన ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న మరో భారీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ నటుడు-దర్శకుడు ద్వయం, భారతీయ చలనచిత్ర రంగంలో…

Read more

సినికేథన్ 2026 వేదికగా ‘సిని క్రియేటర్స్ ఆర్గనైజేషన్(CCO)’ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని NI-MSME ప్రాంగణంలో జరిగిన సినికేథన్ 2026 కార్యక్రమంలో, కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు భారత క్రియేటివ్ ఎకానమీ కి జాతీయ స్థాయి ఏకీకృత వేదికగా 'సిని క్రియేటర్స్ ఆర్గనైజేషన్(CCO)'ను అధికారికంగా ప్రారంభించారు. భారతీయ ఫిల్మ్ , మీడియా మరియు క్రియేటివ్ ఇండస్ట్రీస్ కు చెందిన ప్రతిభావంతులను ఒకే జాతీయ వేదికపైకి తీసుకువచ్చే దిశగా CCO ఆవిర్భావం చారిత్రాత్మక ముందడుగు. CCO లక్ష్యం: డైరెక్షన్ , రైటింగ్ , యాక్టింగ్ , సినిమాటోగ్రఫీ , ఎడిటింగ్ , మ్యూజిక్& సౌండ్ , ఆర్ట్ డైరెక్షన్& ప్రొడక్షన్ డిజైన్ , వీఎఫ్స్ /అనిమేషన్& డిజిటల్ కంటెంట్ , ప్రొడ్యూసింగ్ వంటి సినీ రంగంలోని తొమ్మిది…

Read more

“రణబాలి” డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన హీరో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా "రణబాలి" సినిమా రూపొందుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హీరో విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు విజయ్…

Read more

డిజిటల్ ఛార్జీలు తగ్గించాలంటూ ఫిలింఛాంబర్ వద్ద ఆర్కే గౌడ్,దీక్ష సినిమా టీమ్ మహాధర్నా

చిన్న చిత్రాలకు థియేటర్స్ లభించని పరిస్థితులు ఇండస్ట్రీలో చూస్తున్నాం. అలాగే చిన్న నిర్మాతలు తమ సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ చేసుకోవాలంటే క్యూబ్, యూఎఫ్ వో, పీఎక్స్ డీ వంటి వీపీఎఫ్ ( వర్చువల్ ప్రింట్ ఫీ) ఖర్చులు భారంగా మారాయి. చిన్న చిత్రాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఇలాంటి సమస్యలను అటు ప్రభుత్వం, ఇటు ఇండస్ట్రీ పెద్దలు పరిష్కరించాలని కోరుతూ ఆర్కే గౌడ్, దీక్ష మూవీ టీమ్ హైదరాబాద్ ఫిలింఛాంబర్ వద్ద మహాధర్నా చేపట్టింది. ఈ మహాధర్నాలో ఆర్కే దీక్ష మూవీ దర్శక నిర్మాత, తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణగౌడ్. నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్, నిర్మాతలు గురురాజ్, లయన్ సాయి వెంకట్, హీరో కిరణ్,…

Read more

‘మకుటం’ చిత్రం విజయం సాధించాలని అందరూ కోరుకుంటున్నారు.. ‘నచ్చాకే వచ్చేరా’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో విశాల్

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. స్వర్గీయ ఆర్ బీ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్ సింగిల్ ‘ది రైజ్ అఫ్ లింగా’ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఆదివారం (జూన్ 28) నాడు సెకండ్ సింగిల్ ‘నచ్చాకే వచ్చేరా’ అనే పాటను విడుదల చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో.. విశాల్ మాట్లాడుతూ .. ‘‘మకుటం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నందుకు ఆనందంగా ఉంది. ఈ సారి దర్శకుడిగా మారి ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాను. ‘శివ’ చూసిన తరువాత దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను. ఇన్నాళ్లకు ఆ…

Read more

రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి “స్టూడెంట్” మూవీ టీజర్ రిలీజ్

స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "స్టూడెంట్". ఈ సినిమాలో విజేత పరీక్ హీరోయిన్ గా నటిస్తోంది. జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్స్ పై బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లం సంగీత, బెల్లం బయ్యారెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. "స్టూడెంట్" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. "స్టూడెంట్" సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే - సరదాగా కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసే స్టూడెంట్ భాను (మేఘాంశ్ శ్రీహరి) ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ తరుపున పాలిటిక్స్ లోకి రావడం కాలేజ్…

Read more

హీరో సాయి దుర్గా తేజ్ SYG (సంబరాల ఏటిగట్టు) గ్రాండ్ ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం

మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ SYG (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. 'అసుర ఆగమన' గ్లింప్స్, ప్రమోషనల్ కంటెంట్ కి వస్తున్న భారీ స్పందనతో ఈ చిత్రంపై హ్యుజ్ బజ్ నెలకొంది. పాన్-ఇండియా సంచలనం 'హనుమాన్'ను అందించిన ఈ నిర్మాణ సంస్థ, అత్యున్నత స్థాయి సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. భారీ సెట్ల నుండి అత్యున్నత సాంకేతిక ప్రమాణాల వరకు, నిర్మాతలు రాజీపడకుండా గొప్ప విజన్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నిర్మాణంలో చివరి, అత్యంత కీలకమైన దశకు నాంది పలుకుతూ 'సంబరాల ఏటిగట్టు' చిత్రం ఈరోజు…

Read more

గుర్తుకొస్తున్నాయి’ ట్రైలర్ చాలా నచ్చింది. తప్పకుండా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది: బోయపాటి శ్రీను

-'గుర్తుకొస్తున్నాయి' కంటెంట్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ఈవిన్ లో ఇది మరో పెద్ద విజయం సాధిస్తుంది: హీరో సత్యదేవ్ యంగ్ ట్యాలెంటెడ్ విరాజ్ అశ్విన్ హీరోగా వినోద్ గాలి దర్శకత్వంలో శరత్ చంద్ర నాయుడు నిర్మిస్తున్న సిరిస్ 'గుర్తుకొస్తున్నాయి'. యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, శివ నారాయణ నారిపెద్ది, ప్రియదర్శిని రామ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా గ్లింప్స్, సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూలై 3 నుంచి ఈటీవీ విన్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకలో హీరో సత్యదేవ్, దర్శకులు బోయపాటి శ్రీను, కరుణా కరణ్, నిర్మాతలు మైత్రీ రవి, బన్నీవాసు, ఎస్కేఎన్, ధీరజ్, వంశీనందిపాటి…

Read more

‘హ్యాపీ జర్నీ’ సినిమా అద్భుతంగా వచ్చింది. ఇది మనందరి కథ – సీనియర్ నటి అన్నపూర్ణమ్మ

గుత్తా ప్రొడక్షన్స్ & కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్, అభిరామ్ నాయుడు, హార్ట్‌వార్మింగ్ ఎమోషనల్ డ్రామా ‘హ్యాపీ జర్నీ’ టీజర్ లాంచ్ గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న హార్ట్‌వార్మింగ్ ఎమోషనల్ డ్రామా ‘హ్యాపీ జర్నీ’ . అభిరామ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహిళా భావోద్వేగాలకు ప్రధాన ప్రాధాన్యతనిస్తూ రూపొందుతోంది. బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, తరుణ్ రెడ్డి సహ నిర్మాత . ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాలను ప్రధానంగా చూపించే ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పృధ్వీ దండమూడి, వంశీధర్ గౌడ్, రవి శివతేజ పైలా కీలక…

Read more

సినీ నటి హేమ పొతనకు జన్మదిన శుభాకాంక్షలు

తెలుగు సినీ నటి హేమ పొతన నేడు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. 2013లో మిస్ హైదరాబాద్‌గా గుర్తింపు పొందిన ఆమె, అనంతరం సినీ రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 100% లవ్ చిత్రంలో స్నేహితురాలి పాత్రతో ప్రేక్షకులకు పరిచయమైన హేమ పొతన, మేడమ్, కొడిబుర్ర, ప్రవరాఖ్యుడు (సెకండ్ హీరోయిన్), చలాకీ, కాఫీ బార్, యూ, బావర్స్ తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. అందం, అభినయంతో సినీ ప్రేక్షకులను అలరిస్తున్న హేమ పొతనకు ఈ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆమె మరిన్ని విజయాలు సాధించి సినీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.

Read more