Skip to content

ధనుష్‌ ‘ఇడ్లీ కొట్టు’ కి యూ సెన్సార్ సర్టిఫికేట్

వెర్సటైల్ హీరో ధనుష్‌ ఎప్పుడూ వినూత్నమైన కథలతో అద్భుతమైన నటనతో అలరిస్తుంటారు. ప్రత్యేకమైన కథల ఎంపికతో డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పా పాండి’, ‘రాయన్’ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన ఆయన, ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ వంటి యూత్‌ఫుల్ ఫీల్‌గుడ్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన తర్వాత, ఇప్పుడు తన డైరెక్షన్ లో నాలుగో సినిమాగా ఇడ్లీ కొట్టుతో వస్తున్నారు. 147 నిమిషాల పర్ఫెక్ట్ రన్ టైం తో ఈ చిత్రానికి యూ సర్టిఫికేట్ లభించింది. గత సినిమాలకంటే భిన్నంగా, ఇడ్లీ కొట్టు గ్రామీణ వాతావరణంలో సాగే, భావోద్వేగాలు కథ. ట్రైలర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ వాల్యూస్, ఎమోషనల్‌ లేయర్లతో ధనుష్‌ స్టోరీటెల్లింగ్‌ అదిరిపోయింది. తెలుగు…

Read more

‘మహాకాళి’- అసురుల గురువు శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో తొలి చిత్రం హనుమాన్ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ యూనివర్స్ లో నెక్స్ట్ ఇంస్టాల్మెంట్ మహాకాళి. దీనిని RKD స్టూడియోస్‌ బ్యానర్ పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మించారు. RK దుగ్గల్ సమర్పిస్తున్నారు. ప్రశాంత్ వర్మ క్రియేటర్, షోరన్నర్‌గా వ్యవహరిస్తుండగా, పూజ అపర్ణ కొల్లూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ ఛావాలో ఔరంగజేబు పాత్రను అద్భుతంగా పోషించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా మహాకాళిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది ఆయనకి తెలుగులో తొలి చిత్రం. ఛావా విజయం తర్వాత ఆఫర్లు వెల్లువెత్తినప్పటికీ, కథ బలం, అతని పాత్ర డెప్త్ ద్వారా అక్షయ్ తన తెలుగు రిలీజ్ కోసం మహాకాళిని…

Read more

పరిచయం నుంచి పుత్రబంధం వరకు.. గార సత్యం గారి గురించి కాదంబ‌రి కిర‌ణ్ జ్ఞాపకాల త‌డి

గార సత్యం గారు మొదట సహసభ్యుడిగా పరిచయం అయ్యారు. ఆ పరిచయం క్రమంగా కుటుంబ బంధంగా మారింది. నాపై ఆయన చూపిన నమ్మకం, ప్రేమ, వాత్సల్యం అంతా వర్ణించలేనివి. నన్ను దేవుడిచ్చిన పుత్రుడిలా భావించారు. ఎన్నో ఏళ్లుగా మా బంధం అలాగే కొనసాగింది. ఏదో సందర్భం తీసుకుని వారి ఇంటికి వెళ్లి ఒక మొక్క, ఒక చెక్కు ఇచ్చి వచ్చేవాడిని. పిల్లలు లేరనే బాధను తగ్గించేందుకు నేను ఎంతగానో ప్రయత్నించేవాడిని. "నాకేమైనా అయితే 'మనంసైతం' కాదంబరి ఉన్నాడు" అని నమ్మకం పెంచుకున్నారు. కష్టంగా అనిపించినప్పుడల్లా ఫోన్ చేసి – "ఈ సినిమాలో నా పాత్ర అయిపోయేలా ఉంది సర్" అని చెప్పేవారు. కొన్నేళ్ల తర్వాత ఆయన భార్య చనిపోయారు. (ఆమెను సత్యం గారికి…

Read more

ఆకట్టుకుంటోన్న తిరువీర్ ‘ప్రీ వెడ్డింగ్ షో’ నుంచి ‘వయ్యారి వయ్యారి’ లిరికల్ వీడియో

వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ప్రీ వెడ్డింగ్ షో’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.న‌వంబ‌ర్ 7న సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. Vayyari Vayyari Lyrical Video - https://youtu.be/94LOVOlO3Xw?si= టీజర్ వచ్చిన తరువాత సినిమాపై అంచనాలు పెరిగాయి. వెడ్డింగ్ ఫోటో గ్రాఫర్ చుట్టూ ఓ ప్రేమ కథ, ఓ వింత సమస్య, దాన్నుంచి జెనరేట్ అయ్యే కామెడీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక తాజాగా…

Read more

గచ్చిబౌలిలో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా ప్రారంభమైన 3 keyz Spice కిచెన్ అండ్ కాఫీ లాంజ్ ప్రారంభం

ప్రముఖ సినీ డైరెక్టర్ రామ్ గణపతి మరో ముందడుగు వేశారు. ఆయన స్థాపించిన 3 keyz spice కిచెన్ అండ్ కాఫీ లాంజ్ నిన్న హైదరాబాద్ గచ్చిబౌలి లో వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హీరో ఆకాష్ పూరి, సాయి రోనక్, ప్రముఖ దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం శ్రీలేఖ,chota bheem adhinetha Rajiv chilaka,actor Ajay Ghosh,sameer,thagubothu Ramesh,బెజవాడ బేబక్క, హీరోయిన్ మదులగ్నదాస్, big boss fame Ashwini sree,తదితరులు విచ్చేసి ఈ హోటల్ ఇనాగరేషన్ లో పాల్గొన్నారు . ఈ సందర్భంగా హోటల్ founder and CEO రామ్ గణపతి మాట్లాడుతూ "మా రెస్టారెంట్లో కాఫీ నుండి బిర్యానీ వరకు అన్ని రకాల continental ఐటమ్స్…

Read more

కళ… మనుషుల్ని కలపాలనే విశాల దృక్పథంతో ‘కాంతారా ఛాప్టర్ -1’ టికెట్ ధరలు పెంపు

తెలుగు సినిమాలకు కర్ణాటకలో ఆటంకాలు కల్పిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అభ్యంతరాలు కళ అనేది మనసుల్ని హత్తుకొని మనుషుల్ని కలిపేది... అంతేగానీ భాష, ప్రాంతాల పేరుతో విడదీసి మనుషుల్ని దూరం చేసేది కాదు. సినిమా అనేది భిన్న కళల సమాహారం. అందుకే పర భాషా చిత్రం అనే పేరుతో మన రాష్ట్రంలో వేరుగా చూడాల్సిన అవసరం లేదనే విశాల దృక్పథాన్ని ‘కాంతారా ఛాప్టర్ – 1’ విషయంలో కనపరిచింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. తెలుగు సినిమాలకు కర్ణాటకలో ఆటంకాలు కల్పిస్తున్నారని, ఈ తరుణంలో అక్కడి చిత్రాలకు ఇక్కడ టికెట్…

Read more

బల్ స్టార్ ప్రభాస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, స్టార్ డైరెక్టర్ మారుతి “రాజా సాబ్” సినిమా ట్రైలర్ రిలీజ్, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న మూవీ.

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్" ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ కోసం రెబల్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి వెయిటింగ్ కు తెరదించుతూ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో "రాజా సాబ్" ట్రైలర్ పండుగ ఫీస్ట్ ను అందిస్తూ రిలీజైంది. ఫన్, ఫియర్ తో పాటు వింటేజ్ ప్రభాస్ ను ఆల్ట్రా స్టైలిష్ గా చూపించిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రభాస్ ను ఒక హిప్నాటిస్ట్ ఓ భారీ హవేలీలోకి తీసుకెళ్తడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అక్కడ అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటాయి. దానికి కారణం తాత (సంజయ్ దత్). సైకలాజికల్…

Read more

ప్రేమించాలని డిసైడ్ అయితే ఎన్నొచ్చిన యుద్ధం చేయాల్సిందే’ … ఆకట్టుకుంటోన్న ‘శశివదనే’ ట్రైలర్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే.. https://youtu.be/RpvNiaYLkJ0 ‘గల గల పారే గోదావరి గట్టుతో కళ కళలాడే అందమైన పల్లెటూరులో ఓ అమ్మాయిని చూడగానే తొలి చూపులోనే అబ్బాయికి ప్రేమ పడుతుంది. ప్రేమ ఆ చూపుతో మొదలైంది.. కాలం బొమ్మలా ఆగిపోయింది ఆమెతో పాటే నా మనసు కూడా మాయమైంది’ అనే డైలాగ్ హీరోయిన్‌పై హీరోకి లవ్ డెప్త్ ఏంటో…

Read more

కాంతార: చాప్టర్ 1 ఇండియన్ సినిమాలో బిగ్ బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్

కాంతార: చాప్టర్ 1 సినిమాని తప్పకుండా అక్టోబర్ 2న అందరూ థియేటర్స్ లో చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను: హీరో దర్శకుడు రిషబ్ శెట్టి కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్‌ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్…

Read more