అనకొండ రిటర్న్స్
ప్రేక్షకులను ఒకప్పుడు ఉర్రూతలూగించిన హాలీవుడ్ యాక్షన్ సిరీస్ 'అనకొండ' సరికొత్త అవతారంలో మళ్లీ వెండి తెరపైకి రాబోతోంది. ఈసారి కేవలం భయం మాత్రమే కాకుండా యాక్షన్, కామెడీ, క్రూరమైన గందరగోళం కలగలిపి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. పాల్ రుడ్, జాక్ బ్లాక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, ఈ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదల కానుంది. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా నిర్మించిన ఈ చిత్రానికి టామ్ గోర్మికన్ దర్శకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే, మధ్య వయసులో ఉన్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ - డగ్ (జాక్ బ్లాక్) మరియు గ్రిఫ్ (పాల్ రుడ్) - తమ అభిమాన పాత సినిమాను రీమేక్…
