Skip to content

హైదరాబాద్‌లో యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్–2025 ప్రారంభం

హైదరాబాద్‌లో యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్–2025 ప్రారంభం Telugu News
హైదరాబాద్‌లో యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్–2025 ప్రారంభం Telugu News
హైదరాబాద్‌లో యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్–2025 ప్రారంభం Telugu News

– డిసెంబర్ 5 నుంచి 14 వరకు మూడు వేదికల్లో ప్రదర్శనలు

హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత యూరోపియన్ సినీ సంస్కృతిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తూ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (EUFF)–2025 హైదరాబాద్‌లో శుక్రవారం అద్భుతంగా ప్రారంభమైంది. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు, సాంస్కృతికవేత్తలు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరై వేడుకకు ప్రత్యేక శోభను చేకూర్చారు.

“యూరోపియన్ సినిమాను భారత ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఈ ఫెస్టివల్ 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో ఈ స్థాయి ఫెస్టివల్‌ను నిరంతరం నిర్వహించడంలో సారథి స్టూడియోస్‌ మద్దతు ఎంతో కీలకం,” అని నిర్వాహకులు వెల్లడించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి సారథి స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ MSRV ప్రసాద్, EU ప్రతినిధి బృందం, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ అధ్యక్షుడు K.V. రావు, ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, Alliance Française డైరెక్టర్ మౌద్ మీక్వావు, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ కె. శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

EU డెలిగేషన్ సెకండ్ సెక్రటరీ లోరెంజో పర్రుల్లి మాట్లాడుతూ: “గత ఏడాది హైదరాబాద్‌లో ఫెస్టివల్‌కు వచ్చిన సానుకూల స్పందన మమ్మల్ని మరోసారి ఇక్కడికి రానిచేసింది. ఈసారి 23 యూరోపియన్ సినిమాలను ప్రదర్శిస్తున్నాం. కథల పట్ల, చిత్రసృష్టి పట్ల హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రేమ ప్రత్యేకం. ఇండో–యూరోపియన్ సాంస్కృతిక సంభాషణను మరింతగా బలోపేతం చేయడం మా ముఖ్య లక్ష్యం,” అని తెలిపారు.

సారథి స్టూడియోస్ చైర్మన్ MSRV ప్రసాద్ మాట్లాడుతూ: “హైదరాబాద్ అంటే బ్లాక్‌బస్టర్ సినిమాలకు చిరునామా. యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను మరోసారి మా నగరానికి తీసుకురావడం ఆనందంగా ఉంది. మా సారథి స్టూడియో భాగస్వామ్యంతో 23 చిత్రాలను ప్రదర్శిస్తున్నాం,” అని చెప్పారు.

హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ అధ్యక్షుడు K.V. రావు అన్నారు: “ప్రపంచ సినీ కళను హైదరాబాద్ ప్రేక్షకులకు పరిచయం చేస్తూ 50 ఏళ్లుగా మా క్లబ్ సేవలందిస్తోంది. వరల్డ్ క్లాస్ సినిమాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఈ నగరంలో ఇలాంటి ఫెస్టివల్‌ను నిర్వహించడం మా గర్వకారణం,” అని పేర్కొన్నారు.

Alliance Française డైరెక్టర్ మౌద్ మీక్వావు మాట్లాడుతూ: “ఫెస్టివల్‌లో ప్రదర్శించే ప్రతి సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుందని నమ్ముతున్నాం,” అన్నారు.

ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ: “ఈ ప్రతిష్టాత్మక ఫెస్టివల్‌కు భాగస్వామిగా ఉండటం మా అదృష్టం. నిర్వాహకులకు మా శుభాకాంక్షలు,” అని తెలిపారు.

హైదరాబాద్ – సినీ ప్రేమికుల కేంద్రం
ఫెస్టివల్ నిర్వాహకులు మాట్లాడుతూ “హైదరాబాద్ గడ్డ సినీ ప్రేమికుల అడ్డా” అని పేర్కొన్నారు. ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో విజయవంతంగా ముగిసిన EUFF 30వ ఎడిషన్, ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రేక్షకులను అలరించనుంది.

See also  దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి: మ‌నోజ్ మంచు

డిసెంబర్ 5 నుంచి 14 వరకు
హైదరాబాద్‌లోని మూడు వేదికల్లో ప్రదర్శనలు జరుగనున్నాయి: ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్, శ్రీ సారథి స్టూడియోస్, అలియెన్స్ ఫ్రాన్సైజ్, హైదరాబాద్.

ఉత్తమ కథలు, ప్రపంచ సినిమాల వైభవం, విభిన్న సంస్కృతుల ప్రతిబింబం.. ఇవన్నీ ఒక్కచోట చేరి హైదరాబాద్ సినీప్రియులకు నిజమైన సినీ పండుగ వాతావరణాన్ని అందిస్తాయి.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.