Skip to content

‘ఇడ్లీ కొట్టు’ హార్ట్ టచ్చింగ్ ట్రైలర్ రిలీజ్

‘కుబేర’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరో, డైరెక్టర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్‌, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్ గా ధనుష్ కి ఇది నాలుగో మూవీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. తన తండ్రిని ఒప్పిస్తూ“ఇడ్లీ గ్రైండర్‌ కొంటే పని తేలిక అవుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది” అని చెప్పే సన్నిశంతో మొదలైన ట్రైలర్ అధంత్యం ఆకట్టుకుంది. ధనుష్‌ ఈ సినిమాలో మురళి…

Read more

ఘనంగా ‘మనం సైతం’ ఫౌండేషన్ పుష్కర మహోత్సవం

హైదరాబాద్: నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'మనం సైతం' ఫౌండేషన్ పుష్కర మహోత్సవం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. పన్నెండేళ్లుగా సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఈ ఫౌండేషన్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. నిరంత‌రం కాదంబరి కిరణ్ చేస్తున్న‌ సేవలను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ, "సీనియర్ జర్నలిస్ట్ జీ. కృష్ణ గారి శిష్యుడిని. ఆ మహనీయుడి స్ఫూర్తితోనే స‌మాజిక సేవ ఆలోచ‌న వ‌చ్చింది. 12 ఏళ్లుగా చేస్తున్న‌ ఈ సేవా కార్యక్రమాల్లో ఎంద‌రో మ‌హానుభావులు ఆశీర్వ‌దించారు. మ‌ద్ద‌తు తెలిపారు. వారంద‌రి స‌హ‌కారంతోనే ఈ సేవా కార్య‌క్ర‌మాలు నిరంత‌రం కొన‌సాగిస్తున్నాం" అని అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ,…

Read more

రూ.వంద కోట్ల గ్రాసర్ గా “మిరాయ్”

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ "మిరాయ్" చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ చిత్రంలో ఆయన చేసిన బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. "మిరాయ్" పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది. తాజాగా ఈ మూవీ వంద కోట్ల రూపాయల గ్రాసర్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. "మిరాయ్" ఘన విజయం నేపథ్యంలో మంచు మనోజ్ కు శుభాకాంక్షలు చెప్పింది ఆయన నెక్ట్స్ మూవీ "డేవిడ్ రెడ్డి" టీమ్. మంచు మనోజ్ బ్లాక్ స్వార్డ్ గా నటించిన "మిరాయ్" సినిమా వంద కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరినందుకు కంగ్రాట్స్ అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు "డేవిడ్ రెడ్డి" టీమ్. వెల్వెట్ సోల్ మోషన్…

Read more

బ్యూటీ అందరి మనసులకు హత్తుకునే చిత్రం – నటుడు వీకే నరేష్

అంకిత్ కొయ్య, నీలఖి, వీకే నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నాడు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో.. వీకే నరేష్ మాట్లాడుతూ .. ‘‘బ్యూటీ’ మూవీలోని సోల్ మా అందరినీ ప్రమోషన్స్‌లో ఎక్కువ మాట్లాడించేసింది. ఆ సోల్ ఇప్పుడు ఆడియెన్స్‌కి కనెక్ట్ అవుతోంది. దర్శక, నిర్మాతలకు…

Read more

అభిమానుల ఉత్సాహం మరువలేనిది

‘ఓజీ’ చిత్రానికి సహకారం అందించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సినిమా పరిశ్రమకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుతున్న ప్రోత్సాహకాలకు ఇరువురు ముఖ్యమంత్రులూ చూపిస్తున్న చొరవే కారణం. ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించిన ‘ఓజీ కన్సెర్ట్’కు అనుమతులు ఇవ్వడంలో శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించింది. తెలంగాణ మంత్రివర్గ సభ్యులకు, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ జితేందర్ గారికి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ సి.వి.ఆనంద్ గారికి, లాల్ బహదూర్ స్టేడియం నిర్వాహకులు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. భారీ వర్షం కురుస్తున్నా ఈ…

Read more

‘ఖుషి’ అప్పుడు చూశాను ఈ జోష్.. ఇప్పుడు ‘ఓజీ’కి చూస్తున్నాను: పవన్ కళ్యాణ్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఓజీ'. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించనున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు. 'ఓజీ' సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుండి విడుదలైన ఒక్కో కంటెంట్, ఆ అంచనాలను పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం భారతీయ సినిమాలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా 'ఓజీ' నిలిచింది. సెప్టెంబర్ 25,…

Read more

‘ఇట్లు మీ ఎదవ’ యూత్‌ఫుల్ టైటిల్ గ్లింప్స్ లాంచ్

త్రినాధ్ కఠారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నారు. మన తెలుగు అమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఇట్లు మీ ఎదవ'అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ని లాంచ్ చేసి యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ‘ఇట్లు మీ ఎదవ’ గ్లింప్స్ చూశాను, చాలా బావుంది. చాలా ఫన్నీగా వుంది. ప్రతి అబ్బాయికి ఈ టైటిల్ చిన్నప్పటి నుంచి కెరీర్…

Read more

నవంబర్ 14న ‘శివ’ థియేటర్లలో రిలీజ్

1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్ & సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. ఇండియన్ సినిమాను 'బిఫోర్ శివ' & 'ఆఫ్టర్ శివ' గా రీడిఫైన్ చేసిన శివ గ్రేటెస్ట్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. నాగార్జున మాట్లాడుతూ.. నాన్నగారు ఎప్పుడూ సినిమాకి తరాలకు మించి జీవించే శక్తి ఉందని నమ్మారు. శివ అలాంటి ఒక చిత్రం. నవంబర్ 14న 'శివ' పూర్తిగా కొత్త అవాతర్ లో 4K డాల్బీ అట్మాస్‌తో మళ్ళీ బిగ్ స్క్రీన్ పైకి తీసుకురావడం కథలను ఎప్పటికీ సజీవంగా ఉంచాలనే నాన్న గారి కలకు నివాళి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కల్ట్‌ క్లాసిక్‌ 'శివ' మళ్లీ బిగ్ స్క్రీన్…

Read more

సెప్టెంబర్ 25న ఈటీవీ విన్ OTT లో స్ట్రీమింగ్ కాబోతున్న ” మనసులోని మాట ” చిత్రం

అజిత్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై పోచంబావి గోపీకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం '' మనసులోని మాట ''. మేదిగిరెడ్డి హనుమంతరెడ్డి నిర్మాత. ధర్మారెడ్డి ,పోచంబావి గోపికృష్ణ ,ఆధ్యాశర్మ , అబిత్ , మహదేవ్ ,పార్వతి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న ఈటీవీ విన్ OTT లో స్ట్రీమింగ్ కాబోతుంది... ఈ సంధర్భంగా చిత్రయూనిట్ హైద్రాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహంచింది. ఈ కార్యక్రమానికి సినియర్ నటుడు ఉత్తేజ్ , జబర్దస్త్ అప్పారావు , అల్దాప్ విశిష్ట అథితులుగా పాల్గోన్నారు.. చిన్న చిన్న రియల్ ఏస్టేట్ వ్యాపారం చేసే ఇద్దరు యువకులకు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోని ముందుకు సాగి ఎలా విజయం సాధించారన్నదే…

Read more

నూతన చిత్ర ప్రారంభోత్సవం! Srinivasa Govinda Sri Venkatesha గోవిందా!

హైదరాబాద్ లోని ఫస్ట్ బెటాలియన్ టీజీస్పీ ఆవరణలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం నందు శుభ మూహూర్తన పూజా కార్యక్రమమం నిర్వహించనైనది. ఈ చిత్రం సాయి దేవ క్రియేషన్ బ్యానర్ నందు సిద్దార్థ్ వీరాజ్ హీరోగా స్వీయ దర్షకత్వం లో శ్రీ అనూష గారూ ప్రోడ్యూసర్ గారి ఆద్వ్యర్యంలో ఈ నూతన చిత్రం నిర్మాణం రూపొందనుంది . ఈ కార్యక్రంమంలో ముఖ్య అతిధిగా విచ్చేసినటువంటి శ్రీ మురళీకృష్ణ (ఫస్ట్ బెటాలియన్ క మెండెంట్ T.G.S.P) గారూ క్లాప్ కొట్టి మూవీ పోస్టర్ మరియు టైటిల్ను ఆవిష్కరించారు. నూతన పరిచయం హీరోయిన్ర్లుగా సెహర్ రోషన్ మరియు ముబీనా గారు నటించనున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నటి, నటులు మరియు దర్శక నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు.

Read more