Skip to content

మద్రాస్ నా జన్మభూమి – నందమూరి బాలకృష్ణ

మద్రాస్ నా జన్మభూమి –   నందమూరి బాలకృష్ణ Telugu News

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నై లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి మాట్లాడుతూ.. అందరికీ ధన్యవాదాలు. నేను ఇక్కడ పుట్టడం వల్ల చెన్నై నా ఇల్లులా అనిపిస్తుంది. మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్ర నా ఆత్మభూమి. ఈ చిత్రాన్ని వివిధ దేశాలలో 130 రోజుల్లోనే అద్భుతంగా చిత్రీకరించాం. దేవుని దయ లేకుండా ఇది సాధ్యం కాదు. ధర్మం కోసం జీవించాలి సత్యం కోసం పోరాడాలి, అన్యాయం ముందు తలవంచకూడదు అని మన సనాతన హైందవ ధర్మం చెప్పింది. ఈ సినిమాలో సనాతన ధర్మం పరాక్రమం చూస్తారు. భవిష్యత్ తరాలు ఈ సినిమా ద్వారా సనాతన ధర్మం గురించి నేర్చుకుంటారు. ఇది ప్రేక్షకులకు శాంతిని తెస్తుంది. ఈ సినిమా ఒక ఎన్సైక్లోపీడియా. మా నాన్న గారు నా గురువు, దైవం ఆయన పురాణాలు, సామాజిక, ఫాంటసీ వంటి విభిన్నమైన చిత్రాలను చేశారు. నేను ఆయన బాటలోనే నడుస్తున్నాను.

కరోనాలో అందరూ భయపడుతున్న సమయంలో మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఆ సమయంలో అఖండ చిత్రాన్ని విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయ్యాయి. బోయపాటి, మాది హిట్ కాంబినేషన్. సింహ లెజెండ్ అఖండ సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. ఈ సినిమా కూడా ఘన విజయాన్ని సాధిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తవడం, ఇప్పటికీ హీరోగా కొనసాగుతుండటం నా తల్లితండ్రులు, అభిమానులు ఆశీస్సులని భావిస్తున్నాను. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి, డాకు మహారాజ్‌ వరుసగా హిట్లు కొట్టాం. ‘అఖండ 2’ ఆ జాబితాలో చేరుతుంది. డిసెంబర్ 5 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇది అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా.

డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. అఖండ అఖండ సినిమా చేసాం. అది రీజినల్ సినిమా కాదు ఇండియన్ సినిమా. అలాగే అఖండ 2 ఇది భారత దేశ ఆత్మ. మీరందరూ చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఆడియన్స్ ని కమర్షియల్ గా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆ పరమశివుడే మీ ముందుకు వచ్చి ఒక మంచి సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఆ సందేశం దేశం ధర్మం దైవం వేదం.. ఇది కమర్షియల్ గా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది.

See also  ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.