109 సెంటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ‘మన శంకరవరప్రసాద్ గారు ’
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాను మాస్-ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో తిరుగులేని రాజు అని నిరూపించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మించిన ఆయన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపించే 50 రోజుల థియేట్రికల్ రన్ సాధించింది. ప్రస్తుతం OTT ప్రభావంతో థియేటర్ రన్స్ తగ్గిపోతున్న పరిస్థితుల్లో కూడా, ZEE5లో విడుదలైన తర్వాత కూడా ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. OTT ప్లాట్‌ఫారమ్ ZEE5 లో కూడా MSG ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి, పలు భాషల్లో నెంబర్ 1 ట్రెండింగ్‌గా కొనసాగడం ప్రజాదరణకు నిదర్శనం. ఈ చిత్రం…
