కామ్రేడ్ కళ్యాణ్ చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు: డైరెక్టర్ జానకి రామ్ మారెళ్ల
‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ తో అలరించబోతున్నారు. జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. మహిమా నంబియార్ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ జానకి రామ్ మారెళ్ల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. టైటిల్ ‘కామ్రేడ్ కళ్యాణ్’.. కానీ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లా అనిపిస్తోంది? కామ్రేడ్ కళ్యాణ్ టైటిల్ కథ నుంచే వచ్చింది…
