Skip to content

నాసా పోటీల్లో ప్రతిభ

ఇటీవల నిర్వహించిన ‘నాసా’ జాతీయ స్థాయి పోటీల్లో మెహదీపట్నం శ్రీ చైతన్య స్కూల్‌ విద్యార్థులు 3వ బహుమతి సాధించారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని గురువారం పాఠశాలలో బహుమతుల ప్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు సౌమ్యా దేవి, ఎన్‌. సుశ్మ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ– ‘‘విద్యార్థులు సాధించిన ఈ జాతీయ స్థాయి విజయం పాఠశాలకు గర్వకారణం. వీరు భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలను సాధించాలి’’ అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి.కృష్ణ, ఆర్‌ఐ ఎన్‌.స్వాతి, ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి, కోఆర్డినేటర్‌ జనార్ధన్, డీన్‌ మల్లేష్, ఐపీఎల్‌ ఇంచార్జ్ యాదగిరి, నాసా…

Read more
*మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది..  ‘మోతెవరి లవ్ స్టోరీ’ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో హీరో అనిల్ గీలా Telugu News

*మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది.. ‘మోతెవరి లవ్ స్టోరీ’ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో హీరో అనిల్ గీలా

భారత దేశపు అతిపెద్ద ఓటీటీ ఫ్లాట్ ఫాం అయిన ZEE5 తెలుగు గ్రామీణ తెలంగాణ ప్రాంతంలోని మూలాల్ని ప్రతిబింబించేలా ‘మోతెవరి లవ్ స్టోరీ’ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చింది. అనిల్ గీలా, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఆగస్టు 8న ప్రీమియర్ అయిన సంచలనాత్మక స్పందనను దక్కించుకుంది. శివ కృష్ణ బుర్రా రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మురళీధర్, సదన్న, విజయ లక్ష్మి, సుజాత ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, మై విలేజ్ షో బ్యానర్‌లపై మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ ‘మోతేవారి లవ్ స్టోరీ’ని నిర్మించిన సిరీస్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో మంగళవారం బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు…

Read more