**హైదరాబాద్, తెలంగాణ:** తెలంగాణకు చెందిన స్టార్టప్ **cognitivescore.ai**, వ్యవస్థాపకులు **కీర్తి కుమార్ జైన్** మరియు **విక్రమ్…
నాసా పోటీల్లో ప్రతిభ
ఇటీవల నిర్వహించిన ‘నాసా’ జాతీయ స్థాయి పోటీల్లో మెహదీపట్నం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు 3వ బహుమతి సాధించారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని గురువారం పాఠశాలలో బహుమతుల ప్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ ప్రొఫెసర్లు సౌమ్యా దేవి, ఎన్. సుశ్మ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ– ‘‘విద్యార్థులు సాధించిన ఈ జాతీయ స్థాయి విజయం పాఠశాలకు గర్వకారణం. వీరు భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలను సాధించాలి’’ అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్ ఏజీఎం బి.కృష్ణ, ఆర్‌ఐ ఎన్.స్వాతి, ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, కోఆర్డినేటర్ జనార్ధన్, డీన్ మల్లేష్, ఐపీఎల్ ఇంచార్జ్ యాదగిరి, నాసా ఇంచార్జ్ రత్నవేణి తదితరులు పాల్గొన్నారు.

