Dharmasthala Niyojakavargam – Movie Review Release Date: 04 September 2026 Rating: 3.5/5…
శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ సెర్మొనీ
మెహిదీపట్నంలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో ఇన్వెస్టిచర్ సెర్మొనీ(అధికార బాధ్యతల స్వీకార వేడుక) ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుత భావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ వేడుక చేపట్టారు. ఈ కార్యక్రమానికి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘విద్యార్థులు నిజాయితీ, సేవాభావం, క్రమశిక్షణతో పాటు నాయకత్వ లక్షణాలను అలవరచుకోవాలి’’ అని తెలిపారు. ప్రత్యేక అతిథిగా హాజరైన శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్ ఏజీఎం బి. కృష్ణ మాట్లాడుతూ–‘‘విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలి’’ అని సూచించారు. మెహిదీపట్నం జోన్ ఆర్‌ఐ ఎన్.స్వాతి గౌరవ అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య మెహిదీపట్నం పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి విద్యార్థి నాయకుల చేత పదవీ ప్రమాణం చేయించి, బ్యాడ్జీలు అందజేశారు. ఈ సందర్భంగా హౌస్ ఆఫ్ సీజర్స్, హౌస్ ఆఫ్ కింగ్స్, హౌస్ ఆఫ్ రాయల్స్, హౌస్ ఆఫ్ ఫరావోస్, హౌస్ కెప్టెన్లు మరియు ఇతర విద్యార్థి ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం డీన్ మల్లేష్, ఇన్‌చార్జిలు యాదగిరి, అరుణ, పీఈటీలు అనిత, కృష్ణ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.








