Skip to content

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ – టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా ఇటీవల నియమితులైన శ్రీధర్ వర్మ గారు, టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర, టీటీడీ తిరుపతి జేఈవో శరత్ గారిని కలిసి నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు గారు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసు గారు, తదితరులు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు గారు శ్రీధర్ వర్మకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆశీర్వదించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ముద్దాడ రవిచంద్ర గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి, టీటీడీ ఎస్వీబీసీ చైర్మన్‌గా నియామక పత్రాన్ని శ్రీధర్ వర్మ అందుకున్నారు. అనంతరం అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారిని, టీటీడీ బోర్డు సభ్యులు సంతారావు గారిని మర్యాద పూర్వకంగా కలిశారు.

ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో ఆమోదించిన తీర్మానం మేరకు శ్రీధర్ వర్మను చైర్మన్‌గా నియమించినట్లు ఎండీ ముద్దాడ రవిచంద్ర గారు తెలిపారు. ఆయన నాయకత్వంలో ఎస్వీబీసీ మరింత అభివృద్ధి సాధించి, కొత్త శిఖరాలను చేరుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీధర్ వర్మ గారు ఈ నెల 22వ తేదీన టీటీడీ ఎస్వీబీసీ చైర్మన్‌గా అధికారికంగా ప్రమాణ శ్రీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.