Skip to content

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

జె ఎస్ వి వి ఎంటర్ టైన్ మెంట్స్ మరియు ఎస్ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “మిస్ కాళికా మిస్సింగ్”. సత్య ధనేకుల దర్శకత్వంలో రామకృష్ణ, పదిమల యమున సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు రామకృష్ణ, యమునలు మాట్లాడుతూ”మా చిత్రం పూర్తి సస్పెన్స్ తో సాగే ఎంటర్టైన్మెంట్ చిత్రం. మునిపెన్నడు చూడని కథనం తో ఈ మూవీ చిత్రీకరణ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ పరంగా ఈ చిత్రం డెఫినెట్ గా మంచి మార్కులు తెచ్చుకుంటుంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది .ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాము” అని అన్నారు .

ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ గా వినీత్ చంద్ర, డాలీషా తో పాటు ఎస్తేర్,అజయ్ ఘోష్, బ్రహ్మాజీ ,ఆలీ ,జ్యోతి, నాగ మహేష్, గుండు సుదర్శన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
ఛాయాగ్రహం :శివ దేవరకొండ
మ్యూజిక్ : లీoడర్ లీ మార్టీ
పి ఆర్ ఓ :వీరబాబు
నిర్మాతలు :రామకృష్ణ, పదిమల యమున
దర్శకత్వం :సత్య ధనేకుల

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.