న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల…
అజిత్ కుమార్ ‘గ్లాడియేటర్స్ – ఇన్ పర్స్యూట్ ఆఫ్ ఛాలెంజెస్’ ట్రైలర్ విడుదల
ప్యాషన్, పట్టుదల, సవాళ్లను నిరంతరం ఎదుర్కొనే తపనతో సాగిన నటుడు, రేసింగ్ డ్రైవర్ అజిత్ కుమార్ అసాధారణ మోటార్‌స్పోర్ట్స్ జర్నీని ఆవిష్కరించే డాక్యుమెంటరీ ‘గ్లాడియేటర్స్ – ఇన్ పర్స్యూట్ ఆఫ్ ఛాలెంజెస్’ ట్రైలర్ విడుదలైంది. రేసర్ వెనుక ఉన్న అజిత్ కుమార్‌ను మరింత దగ్గరగా పరిచయం చేస్తూ ఈ ట్రైలర్ సాగుతుంది.
ఇప్పటివరకు లేని విధంగా ‘గ్లాడియేటర్స్’ ట్రైలర్‌ను తొలిసారిగా నేరుగా థియేటర్లలో విడుదల చేశారు. డిజిటల్ రిలీజ్‌కు ముందే బిగ్ స్క్రీన్‌పై ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే మేకర్స్ నిర్ణయానికి థియేటర్లలో భారీ స్పందన లభించింది. తమ అభిమాన స్టార్‌ను స్క్రీన్‌పై చూసిన ప్రతిసారీ అభిమానులు సందడి చేశారు.
అజిత్ కుమార్ అభిమానుల సందడి థియేటర్లలో మార్మోగింది. సినిమాల్లో ఎప్పుడూ చూసే తమ ఫేవరెట్ స్టార్‌ను పూర్తిగా భిన్నమైన అవతార్‌లో.. స్పీడ్, ఛాలెంజెస్‌పై తిరుగులేని ప్యాషన్‌తో రేసర్‌గా చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
విజయ్ దర్శకత్వం వహించిన ‘గ్లాడియేటర్స్’ కేవలం రేస్‌ట్రాక్ గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. మోటార్‌స్పోర్ట్స్‌పై అజిత్ కుమార్‌కు ఉన్న ప్యాషన్, ఆయన స్వీకరించిన సవాళ్లు, ఎదుర్కొన్న రిస్కులు, తన పరిమితులను నిరంతరం అధిగమించేందుకు అవసరమైన డిసిప్లిన్‌ను ఆవిష్కరిస్తుంది.
హై-ఇంటెన్సిటీ రేసింగ్ ఫుటేజ్, బిహైండ్ ది సీన్స్ మూమెంట్స్‌తో పాటు అజిత్‌కు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల పర్సనల్ పర్‌స్పెక్టివ్స్‌ను ట్రైలర్‌లో చూపించారు. సినిమాకు దూరంగా ఆయన జీవితం ఎలా ఉంటుంది? రేసింగ్‌పై ఆయనకున్న తిరుగులేని కమిట్‌మెంట్ ఎలా ఉంటుంది? అనే విషయాలను ఈ ట్రైలర్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు.
ట్రైలర్‌లో అత్యంత ఎమోషనల్ అంశాల్లో ఒకటి షాలిని అజిత్ కుమార్, వారి పిల్లలు అనౌష్క, ఆద్విక్ పంచుకున్న అభిప్రాయాలు. అజిత్‌లోని అత్యంత వ్యక్తిగత కోణాన్ని వారి మాటలు ఆవిష్కరిస్తాయి. తాను సవాళ్లను ఎదుర్కోవాల్సిందే కాబట్టి కాకుండా.. వాటిని ఎదుర్కొనే ప్రయాణమే తనలో అంతర్భాగంగా మారింది కాబట్టే అజిత్ నిరంతరం కొత్త ఛాలెంజెస్‌ను స్వీకరిస్తుంటారని ఈ డాక్యుమెంటరీ తెలియజేస్తుంది.
అజిత్ రేసింగ్ టీమ్ సభ్యులతో పాటు, ఆయన ప్రొఫెషనల్ రేసర్‌గా ఎదిగిన ప్రయాణాన్ని దగ్గరగా చూసిన పలువురు కూడా ట్రైలర్‌లో కనిపిస్తారు. అత్యున్నత స్థాయి ఎండ్యూరెన్స్ రేసింగ్‌లో పోటీ పడేందుకు అవసరమైన ప్రిపరేషన్, ప్రెజర్, డిసిప్లిన్, డిటర్మినేషన్ గురించి వారు తమ అనుభవాలను పంచుకున్నారు.
రేస్‌ట్రాక్ నుంచి పిట్ లేన్ వరకు.. ‘గ్లాడియేటర్స్’ ఒకే ఆలోచనతో సాగిన ప్రయాణాన్ని చూపిస్తుంది . ఈ డాక్యుమెంటరీకి విజయ్ దర్శకత్వం వహించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. గోల్డెన్ ట్రోఫీ ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై షాలిని అజిత్ కుమార్ నిర్మిస్తున్నారు.
‘గ్లాడియేటర్స్ – ఇన్ పర్స్యూట్ ఆఫ్ ఛాలెంజెస్’ కేవలం రేసింగ్ గురించి రూపొందిన డాక్యుమెంటరీ మాత్రమే కాదు. ఎప్పుడూ సులభమైన దారిని ఎంచుకోకుండా.. తన ప్యాషన్‌ను వదులుకోకుండా ముందుకు సాగుతున్న ఓ వ్యక్తి ప్రయాణానికి ఇది పోర్ట్రెయిట్‌లా ఉండబోతోంది.
ఈ చిత్రం నవంబర్ 19న విడుదలకు సిద్ధం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల కోసం అజిత్ కుమార్ అద్భుతమైన రేసింగ్ జర్నీని రేస్‌ట్రాక్ నుంచి బిగ్ స్క్రీన్‌పైకి తీసుకురానుంది.



