పట్టభద్రులైన విద్యార్థుల్ని అభినందించిన విశాల్
యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ విశాల్ సేవాభావం, ఆయన చేసే సమాజ సేవ గురించి అందరికీ తెలిసిందే. పేద విద్యార్థులు, అనాథల గురించి ఆయన ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. ఆయన సేవా సంస్థలు, ట్రస్ట్‌ల ద్వారా ఎంతో మంది పిల్లల్ని ఉచితంగా చదివిస్తుంటారు. ఈ క్రమంలో విశాల్ ఆధ్వర్యంలోని దేవి సోషల్, ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ మద్దతుతో 10 మంది విద్యార్థులు రీసెంట్గా పట్టభద్రులయ్యారు. సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 35వ స్నాతకోత్సవంలో ఈ విద్యార్థులంతా పట్టభద్రులయ్యారు. అంతే కాకుండా దీపిక బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (BCA)లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు ఈ మేరకు విశాల్ తన సంతోషాన్ని ప్రకటిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘ఈ యంగ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ తమ…
