డేవిడ్ థామస్‌గా గౌతమ్ మీనన్ ఫస్ట్ లుక్
యువన్ కృష్ణ ఎంటర్టైన్మెంట్స్, మనస్విని భాగ్యరాజా సమర్పణలో కార్తీక్ భాగ్యరాజా రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. తాజాగా ఈ మూవీ నుంచి గౌతమ్ వాసుదేవ్ మీనన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘డియర్ ఆస్ట్రోనాట్’ చిత్రంలో డేవిడ్ థామస్‌గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ కనిపించబోతోన్నారు. ఈ సినిమాలో ఆయన లుక్ డిఫరెంట్‌గా ఉండబోతోందని ఈ పోస్టర్ చూస్తేనే అర్ధం అవుతోంది. ఈ చిత్రంలో ఆయన పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని, ఆయన క్యారెక్టర్ ఈ ప్రాజెక్ట్‌కు ఆసక్తికరంగాను హైలైట్ గా నిలుస్తుంది. ‘డియర్ ఆస్ట్రోనాట్’ అనేది అంతరిక్షంలోకి ప్రయాణించాలనే ఓ యువతి కథ. చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని, నక్షత్రాల మధ్య విహరించాలని కలలు కనే…
