Skip to content

సంయుక్త ‘ది బ్లాక్ గోల్డ్’ నుంచి పవర్ ఫుల్ విమెన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

సంయుక్త ‘ది బ్లాక్ గోల్డ్’ నుంచి పవర్ ఫుల్ విమెన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ Telugu News

వెర్సటైల్ హీరోయిన్ సంయుక్త ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ హై-వోల్టేజ్, హీరోయిన్-సెంట్రిక్ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా ‘ది బ్లాక్ గోల్డ్‌’లో నటిస్తున్నారు. యోగేష్ కెఎంసి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై మాగంటి పిక్చర్స్‌తో కలిసి రాజేష్ దండా నిర్మిస్తున్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ది బ్లాక్ గోల్డ్’ టీం ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో హీరోయిన్ సంయుక్త ప్రమాదకరమైన మైనింగ్ ప్రాంతం మధ్యలో నిలబడి కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. కథలోని కఠినమైన పరిస్థితులను ప్రతిబింబించేలా ఆ మైనింగ్ బ్యాక్‌డ్రాప్‌ను చూపించారు.

పోస్టర్‌లో సంయుక్త చేతిలో రైఫిల్ పట్టుకుని కనిపించారు. ఆమె ముఖం మీద దుమ్ము, చేతులపై గాయాలు కనిపించడం కథలో ఘర్షణను ప్రజెంట్ చేస్తోంది. ఈ లుక్ సినిమాలోని రా, ఇంటెన్స్ టోన్‌కు పర్ఫెక్ట్ యాప్ట్.

పోస్టర్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే అగ్నిప్రమాదాలు, బొగ్గుతో నిండిన రైలు మైనింగ్ ప్రాంతం గుండా దూసుకెళ్తున్న విజువల్స్ సినిమా భారీ యాక్షన్ స్థాయిని సూచిస్తున్నాయి. “She Believes in the Law, Not the Gun!” అనే ఆసక్తికర ట్యాగ్‌లైన్ కథలోని హీరోయిన్ పాత్రపై క్యూరియాసిటీని పెంచుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. కేవలం చివరి షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. ఫ్రెష్ కథనం, ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతున్న ఈ కమర్షియల్ యాక్షన్ డ్రామా 2026 సమ్మర్‌లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

సంయుక్తతో పాటు, ఈ చిత్రంలో మురళి శర్మ, రావు రమేష్, నాసర్, మనీష్ వాధ్వా, రాంకి, రవీంద్ర విజయ్, అడుకలం నరేన్, బివిఎస్ రవి, కృష్ణ చైతన్య, చంద్రిక రవి వంటి ప్రముఖ తారాగణం ఉంది.

ఈ చిత్రానికి సంగీతం సామ్ సిఎస్ స్వరపరిచారు. ఈ చిత్రంలో రెండు ప్రత్యేక పాటలు ఉంటాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేలా ఈ యాక్షన్ డ్రామాను మేకర్స్ సిద్ధం చేస్తున్నారు.

తారాగణం: సంయుక్త, మురళీ శర్మ, రావు రమేష్, నాసర్, మనీష్ వాధ్వా, రాంకి, రవీంద్ర విజయ్, అడుకలం నరేన్, BVS రవి, కృష్ణ చైతన్య, చంద్రిక రవి

సాంకేతిక సిబ్బంది:
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: యోగేష్ KMC
నిర్మాత: రాజేష్ దండా
సహ నిర్మాత: సింధు మాగంటి
డీవోపీ; ఎ వసంత్
సంగీతం: సామ్ సిఎస్
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
కథ & సంభాషణలు: యోగేష్ KMC & ప్రసాద్ నాయుడు
స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: మధు విప్పర్తి
యాక్షన్: రామ్ క్రిషన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ పోపూరి
PRO: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.