‘ది బ్లాక్ గోల్డ్’ సంయుక్త పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్
వెర్సటైల్ హీరోయిన్ సంయుక్త ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన హై-వోల్టేజ్ ప్రాజెక్ట్ , హీరోయిన్-సెంట్రిక్ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా 'ది బ్లాక్ గోల్డ్' తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యోగేష్ KMC దర్శకత్వంలో, మాగంటి పిక్చర్స్ సహకారంతో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ కథ, చేతిలో గన్ ఉన్నప్పటికీ చట్టాన్ని ముఖ్యంగా భావించే ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్‌ల నేపథ్యంలో, నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ కథ మరింత గ్రిప్పింగ్‌గా తీర్చిదిద్దారు. రిలీజ్ చేసిన తాజా పోస్టర్‌లో సంయుక్త పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తోంది. భారీ ఇండస్ట్రియల్ మెషీన్ ముందు సన్‌గ్లాసెస్‌తో…
