Skip to content

‘ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు’ నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల చేసిన హీరో, నిర్మాత వడ్డే నవీన్

‘ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు’ నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల చేసిన హీరో, నిర్మాత వడ్డే నవీన్ Telugu News

డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై మంచి అంచనాలు ఏర్ప‌డ్డాయి. కమల్ తేజ నార్ల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. వ‌డ్డే నవీన్‌తో క‌లిసి క‌థ స్క్రీన్ ప్లేలో ఈయ‌న భాగ‌మ‌య్యారు. వడ్డే నవీన్‌, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేస్తున్నారు. ఈ క్ర‌మంలో

గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ వ‌చ్చిన‌ వడ్డే నవీన్, ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. రీసెంట్‌గా రిలీజైన‌ టీజర్‌ అందరి దృష్టిని ఆకర్షించి సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. విజువల్స్‌ను బట్టి చూస్తే సినిమా ఎంట‌ర్‌టైన‌ర్ అని తెలుస్తోంది. వడ్డే నవీన్ నటనలో కొత్త కోణాన్ని ఈ చిత్రం ప్రేక్షకులకు ప‌రిచ‌యం చేయ‌బోతున్న సినిమా ఇదని తెలుస్తోంది.

మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మేక‌ర్స్ ఈరోజు మూవీ నుంచి ‘టా టా’ అనే సాంగ్‌ను తొలి సాంగ్‌గా రిలీజ్ చేశారు. క‌ళ్యాణ్ నాయ‌క్ స్వ‌ర‌ప‌రిచిన ఈ పాట‌ను భాస్క‌ర‌భ‌ట్ల రాశారు. న‌క‌ష్ అజీజ్ ఎన‌ర్జిటిక్ వాయిస్‌తో పాట‌ను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లారు. ఈ పాట ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు క్యారెక్ట‌ర్‌ను మ‌రింత ఎలివేట్ చేస్తోంది. సాధార‌ణ కానిస్టేబుల్ నిజాయ‌తీగా ఉంటూ ఇత‌రుల‌కు సాయం చేస్తూనే మొండివాడుగా ఉంటుంటాడనే విష‌యాల‌ను ఈ పాట తెలియ‌జేస్తోంది. విజ‌య్ పోలాకి కంపోజ్ చేసిన కొరియోగ్ర‌ఫీ చాలా బావుంది.

విజ‌య మాధ‌వి కంబైన్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి తార‌క రామారావుతో బొబ్బిలిపులి, చిరంజీవితో లంకేశ్వ‌రుడు, కృష్ణంరాజుతో క‌ట‌క‌టాల రుద్రయ్య బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు స‌హా ఎ.ఎన్‌.ఆర్‌, కృష్ణ వంటి దిగ్గ‌జ న‌టుల‌తో ఎన్నో క్లాసిక్ చిత్రాల‌ను రూపొందించిన సీనియ‌ర్ నిర్మాత వ‌డ్డే ర‌మేష్ త‌న‌యుడే వ‌డ్డే న‌వీన్‌. తండ్రి గొప్ప సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ వ‌డ్డే న‌వీన్‌ ఇప్పుడు మంచి కథా చిత్రాలను నిర్మించాలనే లక్ష్యంతో వ‌డ్డే క్రియేష‌న్స్‌ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్‌పై రూపొందుతున్న తొలి చిత్రం ‘ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు’.

నటీన‌టులు:

వ‌డ్డే న‌వీన్‌, రాశీ సింగ్, ర‌ఘు బాబు, సాయిశ్రీనివాస్‌, బాబా మాస్ట‌ర్‌, శిల్పా తులస్కర్‌. , వివేక్ రఘువంశీ, దేవిప్రసాద్, సూర్యకుమార్ భగవత్ దాస్, శివ నారాయణ, ప్రమోదిని, గాయత్రి భార్గవి, జ్వాలా కోటి, దేవి మహేష్, ఊహా రెడ్డి, రేఖా నిరోష్, గాయ‌త్రి చాగంటి, సాత్విక్ రాజు, అంజ‌లి ప్రియ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌: వ‌డ్డే క్రియేష‌న్స్‌
స‌మ‌ర్ప‌ణ‌: వ‌డ్డే జిష్ణు
నిర్మాత‌: వ‌డ్డే న‌వీన్‌
డైరెక్ట‌ర్‌: క‌మ‌ల్ తేజ నార్ల‌
స్టోరీ, స్క్రీన్ ప్లే: క‌మ‌ల్ తేజ నార్ల‌, వ‌డ్డే న‌వీన్‌
మ్యూజిక్‌: క‌ళ్యాణ్ నాయ‌క్‌
సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ సుజాత సాయి కుమార్‌
ఎడిట‌ర్‌: విజ‌య్ ముక్తావ‌ర‌పు

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.