స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న…
‘ఆల్ఫా’యాక్షన్ ఫిల్మ్ అద్భుతం! ఆలియా భట్‌తో యాక్షన్ థ్రిల్లింగ్‌గా అనిపించింది – బాబీ డియోల్

యశ్ రాజ్ ఫిల్మ్ రూపొందిస్తోన్న భారీ యాక్షన్ మూవీ ‘ఆల్ఫా’ లో నటించటం చాలా సరదాగా అనిపించిందని అంటున్నారు బాలీవుడ్ యాక్షన్ స్టార్ బాబీ డియోల్. వ్యక్తులను చంపటానికి శిక్షణ ఇచ్చి పెంచి పెద్ద చేసిన ఓ హంతకురాలి కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. మరో హీరోయిన్ శర్వారి కూడా నటిస్తోంది. ఇద్దరు హీరోయిన్స్ నటిస్తోన్న ఈ ఫుల్ యాక్షన్ మూవీ ఇండియాలో రూపొందటం చాలా సంతోషంగా ఉందని బాబీ అన్నారు. కచ్చితంగా ఈ ఆల్ఫా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బాబీ డియోల్ మాట్లాడుతూ ‘‘నాకు రణ్‌భీర్ కపూర్, ఆలియా భట్ అంటే చాలా ఇష్టం. వాళ్లిద్దరితో కలిసి పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటుండేవాడిని. రణ్‌భీర్ కపూర్‌తో అనిమల్ సినిమా చేశాను. ఇప్పుడు ఆలియా భట్‌తో ఆల్ఫా సినిమా చేస్తున్నాను. ఇది నిజంగా నాకెంతో ఆనందాన్నిచ్చే విషయం. ఇండియన్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ యాక్షన్ సన్నివేశాల్లో నటించటం చాలా గొప్ప విషయం. సినిమా నాకెంతో నచ్చింది. ఎందుకంటే ఇది నాకు కొత్తగా, ఫ్రెష్‌గా ఉంది. ప్రేక్షకులకు థియేటర్స్‌లో ఓ కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది.
ఆలియా భట్ యాక్షన్ సన్నివేశాల్లో నటించిన తీరు.. అందుకు ఆమె సన్నద్ధమైన తీరు నన్నెంతగా ఆకట్టుకుంది. ఎంతో కఠినమైన యాక్షన్ సీక్వెన్స్‌లో ఆమె అద్భుతంగా నటించింది. నేను కలిసి పని చేసిన నటీనటుల్లో ఆలియా భట్ చాలా కష్టపడే తత్వమున్న వ్యక్తి. చాలా నిజాయతీతో పని చేస్తుంది. షూటింగ్‌కు వచ్చే ముందు బాగా సన్నద్ధమవుతుంది. ఎంతో శ్రద్ధతో సెట్స్‌లో పని చేస్తుంది. ఇప్పటి వరకు ఆమె ఇలాంటి పాత్రలో నటించలేదు. అలాంటి పాత్ర కోసం ఆమె సన్నద్ధమైన తీరు చూసి నేను ఆశ్చర్యపోయాను. యాక్షన్ సీక్వెన్స్‌లు చేయటం అంత సులభం కాదు. ఆమె తన శక్తినంతా పెట్టి సినిమా చేయటం నిజంగా గొప్ప విషయం.
నిర్మాత ఆదిత్య చోప్రా, నిర్మాత శివ్ రవాలికి యాక్షన్ సన్నివేశాలు రా అండ్ రియల్‌గా కనిపించాలంటే ఎలా చేయాలనే దానిపై పూర్తి క్లారిటీ ఉంది. కాబట్టి ఈ షూటింగ్‌ను పూర్తి చేయటానికి మేం చాలా కష్టపడ్డాం. అయితే రేపు థియేటర్స్‌లో ఆడియెన్స్ సినిమాను హాయిగా కూర్చుని ఆస్వాదిస్తారు’’ అన్నారు.
‘ఆల్ఫా’ మూవీని గ్లోబల్ హిట్ సిరీస్ రైల్వే మెన్ ఫేమ్ శివ్ రవాలి తెరకెక్కిస్తున్నారు. అనీల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జూలై 10న ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.

