స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ ను సత్కరించిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్
ఇటీవలే నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSFTvTDC) చైర్మన్ భరత్ భూషణ్ గారిని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు..
ఫిలిం ఛాంబర్ లో కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు.
ఈ సందర్భంగా APSFTvTDC చైర్మన్ భరత్ భూషణ్ గారిని FCA కార్యవర్గం బొకే తో, మరియు శాలువా కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా చైర్మన్ భరత్ భూషణ్ మాట్లాడుతూ “ఏపీలో సినీ రంగ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా తన వంతు కృషి చేస్తానని, త్వరలోనే ఏపీ లో నంది అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహి స్తాము’ అని తెలిపారు.
ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సానుకూలంగా ఉన్నారని భరత్ భూషణ్ తెలిపారు.
భరత్ భూషణ్ గారి సత్కార కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్,
ఎఫ్ సి ఏ అధ్యక్షులు బత్తుల జేవి ప్రసాదరావు, ప్రదాన కార్యదర్శి సురేష్ కొండేటి, ఉపాధ్యక్షులు జనార్దన్ రెడ్డి, ఎండి అబ్దుల్, జాయింట్ సెక్రెటరీ శ్యామ్ కుమార్.. ఇతర కార్యవర్గ సభ్యులు
ఎం గిరిధర్, ఆర్ డి ఎస్ ప్రకాష్, కేశవ చారి, నవీన్ కుమార్, అప్పాజీ, జిల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు.



