Skip to content

‘ఆర్యన్’ తెలుగులో నవంబర్ 7న రిలీజ్

64ac6fe2-c95e-4015-bfba-edc55894d2bd

విష్ణు విశాల్ మోస్ట్ ఎవైటెడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’, ప్రవీణ్ కె దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా, ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 31న విడుదల చేయాలని ముందుగా అనుకున్న ఈ సినిమా నవంబర్ 7కి వాయిదా పడింది. అయితే, తమిళ వెర్షన్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 31న విడుదల కానుంది.

శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి, మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్లతో అలరిస్తున్నారు. టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ అద్భుతమైన స్పందనను పొంది సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

వాయిదాకు గల కారణాలను స్పష్టం చేస్తూ విష్ణు విశాల్ ఒక అనౌన్స్మెంట్ విడుదల చేశారు.

డియర్ తెలుగు ఆడియన్స్..

సినిమా అనేది రేస్ కాదు, అది ఒక వేడుకని నేను ఎప్పుడూ నమ్ముతాను. ప్రతి వేడుకకీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం, వెలుగు ఉండాలి.

మా చిత్రం ‘ఆర్యన్’ అక్టోబర్ 31న విడుదల కావలసి ఉంది. ఈ ప్రత్యేక తేదీ మాస్ మహారాజా రవితేజ గారు మాస్ జాతర, పవర్ ఫుల్ బాహుబలి ది ఎపిక్ మీ అందరినీ అలరించడానికి రావడంతో మరింత ప్రత్యేకమైనది.

నేను ఎప్పటినుంచో రవితేజ గారిని గాఢంగా ఆరాధిస్తాను. స్క్రీన్‌పైన ఆయన ఎనర్జీకి మాత్రమే కాకుండా, మాకు ఆయన మద్దతు (నా గట్టా కుస్తీ సినిమాకి ఆయన సహనిర్మాతగా ఉన్నారు) కూడా వుంది. అలాగే, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి గారికి నేను లైఫ్ టైం ఫ్యాన్ ని. ఈ వారం వారి సినిమాలని సెలబ్రేట్ చేసుకోవడం సరైనదని భావిస్తున్నాను.

#ఆర్యన్ సినిమా తమిళ్ విడుదలైన ఒక వారం తర్వాత అదే పాషన్, థ్రిల్ తో నవంబర్ 7న తెలుగులోకి వస్తుంది.

మీ మద్దతుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
నా నిర్ణయానికి అండగా నిలిచిన మా డిస్ట్రిబ్యూటర్లు శ్రీ సుధాకర్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు (Sreshth Movies)లకు ప్రత్యేక కృతజ్ఞతలు.

నా సినిమా తనకంటూ ఒక మంచి స్థానం సంపాదించుకోవాలని నేను కోరుకుంటున్నాను.
తెలుగు ప్రేక్షకుల కోసం విభిన్నమైన సినిమాలు అందించాలనే నా ప్రయత్నంలో ఇది ఒక మంచి ప్రారంభం అవుతుందని నేను నమ్ముతున్నాను.

ప్రేమతో
విష్ణు విశాల్ ❤️

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.