Skip to content

రోషన్ ‘ఛాంపియన్’ టీజర్ రిలీజ్

రోషన్  ‘ఛాంపియన్’  టీజర్ రిలీజ్ Telugu News

యంగ్ హీరో రోషన్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ , కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కథల ఎంపికలో, ప్రతిసారీ బ్లాక్‌బస్టర్‌లను అందించడంలో స్వప్న సినిమాస్ వెరీ స్పెషల్.

ఇప్పటికే విడుదలైన రోషన్, అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

స్వాతంత్ర్యానికి ముందు హైదరాబాద్లో నివసించే ఆర్మీ మాన్, ఫుట్‌బాలర్ మైఖేల్ సీ. విలియమ్స్. మైదానంలో ప్రత్యర్థులను సవాలు చేస్తూ తన ప్రతిభను ప్రదర్శించే ఈ యంగ్‌మ్యాన్‌కి ఇంగ్లండ్‌లో రాణి ఎలిజబెత్‌ను కలుసుకునే అవకాశం దక్కుతుంది. దేశం కోసం ఆడే అవకాశమొచ్చినా, అతని మనసు మాత్రం తన ప్రేయసి వద్దే ఉంటుంది. కానీ జీవితం అతనికి మరిన్ని సవాళ్లు, భావోద్వేగాలు, యుద్ధం, ప్రేమ.. అన్నీ ఒకేసారి ఎదురుచూపిస్తుంది.

ఫుట్‌బాలర్‌గా రోషన్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించాడు. హైదరాబాదీ యాసలో హిందీ మిక్స్ చేసిన అతని డైలాగ్ డెలివరీ చాలా న్యాచురల్‌గా, క్యారెక్టర్‌కి తగినట్టుగా ఉంది. యాక్షన్ సన్నివేశాల్లో ఎనర్జీ, రొమాంటిక్ సీన్స్‌లో ఫినెస్, ఆత్మవిశ్వాసంతో కూడిన అటిట్యూడ్‌తో రోషన్ ఆకట్టుకున్నాడు. అనస్వర రాజన్ అందంగా కనిపించింది. ఇద్దరి కెమిస్ట్రీ మనసుకు హత్తుకునేలా ఉంది.

దర్శకుడు ప్రదీప్ అద్వైతం స్పోర్ట్స్, డ్రామా, యాక్షన్, రొమాన్స్, వార్ అన్నీ ఎలిమెంట్స్ లో అద్భుతమైన నారేషన్‌తో ఆకట్టుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి.

ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి ప్రీ-ఇండిపెండెన్స్ కాలాన్ని అద్భుతంగా రీక్రియేట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ ఆర్. మధీ వండర్ ఫుల్ విజువల్ క్యాప్చర్ చేశారు. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ టెన్షన్, ఎమోషన్ రెండింటినీ అద్భుతంగా బ్లెండ్ చేశారు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు కట్టింగ్‌ ఎడ్జ్ ఎడిటింగ్‌తో పేస్‌ను మెయింటైన్ చేశారు.

ఛాంపియన్ టీజర్ హిస్టరీ, స్పోర్ట్స్ డ్రామా, లవ్ స్టొరీ, అద్భుతమైన కంటెంట్‌తో సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్‌కు విడుదల కానుంది.

తారాగణం: రోషన్, అనస్వర రాజన్

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్లు: స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్
సమర్పణ: జీ స్టూడియోస్
దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం
డిఓపి: ఆర్ మధీ
సంగీతం: మిక్కీ జె మేయర్
ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
పీఆర్వో: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.