Skip to content

వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా వీరేష్ కోకా దర్శకత్వంలో సురవి విజన్స్ ప్రొడక్షన్ నెం1 ఘనంగా ప్రారంభం

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా పరిచయం అవుతున్నారు. వీరేష్ కోకా దర్శకత్వంలో సురవి విజన్స్ బ్యానర్ పై పి చక్రధర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైయింది.

ముహుర్తపు సన్నివేశానికి డైరెక్టర్ డాలీ క్లాప్ కొట్టి గౌరవ దర్శకత్వం వహించారు. గంటా రవితేజ కెమరా స్విచ్ ఆన్ చేశారు. నల్లమలుపు బుజ్జి మేకర్స్ కి స్క్రిప్ట్ అందించారు. పలువురు సినీ ప్రముఖులు, చిత్ర బృందం ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ చిత్రంలో దివ్యాని మొండల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. S చంద్రశేఖరన్ డీవోపీ గా, బిబిన్ అశోక్ సంగీత దర్శకుడిగా, నిరంజన్ దేవరమానే ఎడిటర్ గా పని చేస్తున్నారు. జూన్ 29 నుంచి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

మూవీ లాంచింగ్ ఈవెంట్‌లో వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను 275 కు పైగా సినిమాలకు పని చేశాను. ప్రేక్షకులు నాకు ఎంతో ప్రేమ, అభిమానాన్ని అందించారు. ఇప్పుడు ఈ సినిమాతో మా అబ్బాయి హీరోగా పరిచయం అవుతున్నాడు. అదే ప్రేమ, అభిమానాన్ని తనపై కూడా చూపిస్తారని కోరుకుంటున్నాను. దర్శకుడు వీరేష్ గారు చాలా అద్భుతమైన కాన్సెప్ట్‌ను రూపొందించారు. ఆయన చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ప్రస్తుత యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించే కథ ఇది. ఈ సినిమాతో మా అబ్బాయికి మంచి పేరు వస్తుందని, మీ అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను. నిర్మాత చక్రధర్ రెడ్డి గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంత మంచి కాన్సెప్ట్‌కు ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతుంది. దర్శకుడు ఈ కథను ఎంతో అద్భుతంగా మలిచారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను. చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ నా అభినందనలు.

హీరో సుస్వర తరంగ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మా దర్శకుడు, నిర్మాతతో పాటు మా టీమ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా తొలి సినిమాకే ఇంత మంచి అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మంచి సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

దర్శకుడు వీరేష్ కోకా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నన్ను, నా టీమ్‌ను నమ్మి వందేమాతరం శ్రీనివాస్ గారు వారి అబ్బాయిని హీరోగా పరిచయం చేసే బాధ్యత మాకు ఇచ్చారు. వారు పెట్టుకున్న నమ్మకాన్ని కచ్చితంగా నిలబెట్టుకుంటాను. ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్. హైదరాబాద్, వైజాగ్‌లలో చిత్రీకరణ జరుపుతాం. మీ అందరి ఆశీర్వాదాలు, సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను.

హీరోయిన్ దివ్యాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుగులో ఇది నా తొలి సినిమా. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా దర్శకుడు, నిర్మాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా మీ అందరి ప్రేమ, ఆదరణ ఈ సినిమాకు ఉంటుందని ఆశిస్తున్నాను.

నటీనటులు: సుస్వర తరంగ్, దివ్యాని మొండల్

దర్శకత్వం: వీరేష్ కోకా
నిర్మాత: పి చక్రధర రెడ్డి
ప్రొడక్షన్ హౌస్: సురవి విజన్స్
డీవోపీ: S చంద్రశేఖరన్
సంగీతం: బిబిన్ అశోక్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
కొరియోగ్రాఫర్: ఈశ్వర్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి
డిజైనర్లు: అనిల్ – భాను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: తిమ్మారెడ్డి వంక, గంటా చిరంజీవి
పీఆర్వో: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.